News February 26, 2025
వేంపాడులో లారీ ఢీకొని కాకినాడ జిల్లా వాసి మృతి

నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందినట్లు ఎస్సై సన్నిబాబు మంగళవారం తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన చిక్కాల శ్యాంప్రసాద్ (29) వేంపాడు వద్ద ఫ్యాబ్రిక్స్ వర్క్స్ షాపులో పని చేస్తున్నాడు. స్నేహితుడితో కలిసి బైక్‌పై టోల్ ప్లాజా వద్ద టీపాయింట్‌కు వెళుతుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్యాం ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News December 20, 2025
సిరియా ISIS స్థావరాలపై US వైమానిక దాడులు

సిరియాలోని ఇస్లామిక్ స్టేట్(ISIS) ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా US వైమానిక దళాలు దాడులకు దిగాయి. ఇటీవల సిరియాలో ముగ్గురు అమెరికన్లను చంపిన నేపథ్యంలో ప్రతీకారంగా ఆపరేషన్ హకియి స్ట్రైక్ పేరుతో ఎటాక్ చేసినట్టు US డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్ తెలిపారు. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా వేటాడి చంపుతామన్నారు. ట్రంప్ లీడర్‌షిప్‌లో అమెరికన్లను కాపాడుకోవడానికి వెనకాడబోమని చెప్పారు.
News December 20, 2025
‘గరుడ’ విష్ణుమూర్తి వాహనం ఎలా అయ్యాడు?

వినత కుమారుడైన గరుడుడు తన తల్లిని బానిసత్వం నుంచి విడిపించడానికి కద్రువ కోరిక మేరకు దేవలోకం నుంచి అమృతాన్ని తెస్తాడు. అపారమైన శక్తి ఉన్నా, అమృతంపై ఆశ పడడు. తల్లి కోసం నిస్వార్థంగా పనిచేసిన ఆయన ధైర్యం మహావిష్ణువును మెప్పించాయి. దీంతో విష్ణుమూర్తి, అతనికి చిరంజీవిత్వం ప్రసాదించి తన వాహనంగా, ధ్వజంగా స్వీకరించారు. గరుడుడు సముద్రాలను దాటగలడు. వేగవంతుడు. విష్ణు సాయం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.
News December 20, 2025
సూర్యాపేట: తల్లి కూలీ.. కొడుకుకు GOVT జాబ్

ఇటీవల ప్రకటించిన గ్రూప్-3 ఫలితాల్లో సూర్యాపేట జిల్లా మోతె మండలం గోపతండాకు చెందిన జరుపుల రంగ సత్తా చాటి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి కలిగిన రంగ ప్రస్తుతం హైదరాబాద్‌లో UPSC సివిల్స్‌కు సిద్ధమవుతూ IAS కావడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కూలీ పని చేస్తూ ఎన్నో కష్టాలు భరించి కొడుకును ప్రభుత్వాధికారిలా తీర్చిదిద్దిన తల్లి త్యాగం స్ఫూర్తిదాయకం.


