News September 5, 2025

వేంసూరు: నిమజ్జన ఊరేగింపులో అపశ్రుతి

image

వేంసూరు మండలంలో జరిగిన గణేశ్ నిమజ్జన ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి వి.వెంకటాపురం గ్రామంలో నిమజ్జనానికి వెళ్తుండగా ట్రాక్టర్ పైనుంచి షేక్ రషీద్ (20) అనే యువకుడు కిందపడి మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతున్న రషీద్ స్నేహితుడికి డ్రైవింగ్ ఇచ్చి పక్కన కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలు కావడంతో చనిపోయాడు.

Similar News

News September 5, 2025

అధికారులు సమన్వయంతో పని చేయాలి: ఖమ్మం సీపీ

image

గణేశ్ విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ప్రతి విభాగం సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణకు కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. డీజేలకు అనుమతి లేదని, నిర్దేశించిన సమయంలోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని ప్రత్యేకంగా సూచించారు.

News September 5, 2025

ఖమ్మం: సదరం సర్టిఫికేట్లకు రూ.50 వేలు డిమాండ్..!

image

ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో సదరం క్యాంపుల్లో అవినీతి జరుగుతోందని బాధితుడు ఫిర్యాదు చేశారు. సదరం విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది బయటి వ్యక్తులతో కలిసి దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. శాశ్వత ధ్రువీకరణ పత్రానికి రూ.50 వేలు, ఐదేళ్ల సర్టిఫికేట్‌కు రూ.30 వేలు డిమాండ్ చేస్తున్నారని బాధితుడు శ్రీను గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్‌కు ఫిర్యాదు చేశారు.

News September 5, 2025

ఖమ్మం జిల్లాలో 6న వైన్స్ బంద్: సీపీ

image

గణేష్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం విక్రయాలపై సీపీ సునీల్ దత్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్ & రెస్టారెంట్లు, క్లబ్‌లు, హోటళ్లు మూసివేయాలని ఆదేశించారు. నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.