News November 21, 2025

వేగంగా విస్తరిస్తోన్న విశాఖ

image

GDPలో దేశంలో టాప్-10 నగరాలలో నిలిచిన విశాఖ నగరం వేగంగా విస్తరిస్తొంది‌. కార్పొరేషన్‌గా ఉన్న విశాఖపట్నం తరువాత గాజువాక, భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీల విలీనంతో మహా విశాఖ నగర పాలక సంస్థగా ఏర్పడింది. ఇప్పుడు అనకాపల్లి నుంచి విజయనగరం వరకు అభివృద్ధితో వేగంగా దూసుకుపోతోంది. ఒక వైపు భోగాపురం ఎయిర్ పోర్టు, మరోక వైపు డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు వస్తున్నాయి.CII సమ్మిట్‌లో పెద్ద ఎత్తన పెట్టుబడులు వచ్చాయి.

Similar News

News November 21, 2025

SRSP: 947.474 TMCల వరద

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఈ ఏడాది జూన్ 1 నుంచి నేటి వరకు 947.474 TMCల వరద వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రాజెక్టు నుంచి 879.761 TMCల అవుట్ ఫ్లో కొనసాగిందన్నారు. కాగా గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి యావరేజ్‌గా 3,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు వివరించారు.

News November 21, 2025

చిత్తూరు: రాగుల పంపిణీకి చర్యలు

image

చిత్తూరు జిల్లాలోని రేషన్ షాపుల్లో డిసెంబరు నెల నుంచి రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ లక్ష్మి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాకు 350 టన్నుల జొన్నలు, 350 టన్నుల రాగులను కేటాయించిందన్నారు. చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో వీటిని పంపిణీ చేస్తామన్నారు. కార్డుదారులకి ఇస్తున్న బియ్యం కోటాలో ఒక్కొక్క కేజీ వంతున రాగులు, జొన్నలు అందజేస్తామని చెప్పారు.

News November 21, 2025

పల్నాడు: కాలువల మరమ్మతులలో నిధుల దుర్వివినియోగం

image

పల్నాడు ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో మేజర్, మైనర్ కాలువల మరమ్మతులలో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది. అధికారుల సహాయంతో కొందరు నేతలు కాలువలకు మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లులు చేసుకున్నట్లు సమాచారం. రైతుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ ఎంక్వయిరీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.