News September 7, 2025

వేటపాలెంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

వేటపాలెంలో ఆదివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. వేటపాలెం కొత్త కాలువ రైల్వే బ్రిడ్జి కింద నీటిలో పురుషుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి ఎస్సై జనార్ధన్‌కు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించిన ఎస్సై మృతుడి ఫొటోలను విడుదల చేశారు. అతని వివరాలు తెలిసిన వారు వేటపాలెం పోలీస్ స్టేషన్‌ లేదా చీరాల సర్కిల్ సీఐకి కానీ సమాచారం అందించాలని కోరారు.

Similar News

News September 8, 2025

జగిత్యాల: తెలంగాణ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సత్యనారాయణ

image

తెలంగాణ నీట్ పేరెంట్స్ అసోసియేషన్–2025 అధ్యక్షుడిగా సత్యనారాయణ చారి ఎన్నికయ్యారు. నీట్ సమస్యలపై పోరాడేందుకు సోమవారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా రమేష్ లను, అలాగే ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నీట్‌లో తెలంగాణ పిల్లలకు జరుగుతున్న నష్టంపై పోరాడేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.

News September 8, 2025

వనిపెంట: ఆ నర్సరీలతో నష్టపోతున్న రైతన్నలు..?

image

వనిపెంట ప్రాంతంలో నర్సరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వ్యవసాయ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా ఇష్టానుసారంగా నర్సరీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాణ్యత లేని, కల్తీ విత్తనాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నర్సరీ యజమానులు కొందరు నాణ్యత లేని విత్తనాల నారును రైతులకు అంటగడుతూ లాభం పొందుతున్నారు. నర్సరీలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

News September 8, 2025

DRDO-CHESSలో 25 పోస్టులు

image

హైదరాబాద్‌లోని DRDOకు చెందిన సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్(CHESS)లో 25 అప్రెంటిస్ పోస్టులున్నాయి. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, డిప్లొమా పాసై ఉండాలి. అభ్యర్థుల మార్కుల శాతం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు ఈ నెల 22 చివరి తేదీ. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.9వేలు, టెక్నీషియన్అప్రెంటిస్‌లకు రూ.8వేలు స్టైఫండ్ ఇస్తారు. వెబ్‌సైట్: drdo.gov.in