News April 16, 2025

వేటపాలెం: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

image

విద్యుత్ వైరు తగిలి ఒక వ్యక్తి చనిపోయిన ఘటన వేటపాలెం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ M. వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. అనుమల్లి పేటకు చెందిన వ్యక్తి ఇంటికి వెళ్లే క్రమంలో వర్షం కారణంగా తెగిపడిపోయిన వైరు అడ్డంగా ఉండడాన్ని గమనించి దాన్ని తప్పించే క్రమంలో పట్టుకున్నాడు. ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలి బొడ్డు మోహన్ రావు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Similar News

News December 30, 2025

BIG BREAKING: సిద్దిపేట: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

image

TGలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా మొదలైంది. ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీల కమిషనర్లతో నిర్వహించిన VCలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి. SHARE IT

News December 30, 2025

REWIND-2025: విశాఖ అభివృద్ధిలో కీలక మలుపు

image

2025లో ఉమ్మడి విశాఖ అభివృద్ధి దిశగా కీలక మలుపు తిరిగింది. ఐటీ, పరిశ్రమలు, మౌలిక వసతుల పరంగా రాష్ట్ర ఆర్థిక పటంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ ఏడాది విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన అంశంగా గూగుల్ డేటా సెంటర్ ప్రకటన నిలిచింది. ఉమ్మడి జిల్లాలో ప్రతిపాదిత మిట్టల్ స్టీల్ ప్లాంట్ పరిశ్రమల రంగంలో కొత్త ఆశలు రేపింది. మొత్తంగా 2025 విశాఖ అభివృద్ధి పునాదులు వేసిన ఏడాదిగా నిలిచింది.

News December 30, 2025

పర్యాటకులతో కిక్కిరిసిన విశాఖ.. జనవరి 4 వరకు ఇదే పరిస్థితి!

image

విశాఖ నగరానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. నూతన సంవత్సరం, వరుస సెలవుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో పర్యాటకులు విశాఖకు తరలివచ్చారు. నగరంలో ఉన్న 30 స్టార్ హోటళ్లలోని 2,400 గదులు, అలాగే బడ్జెట్ హోటళ్లలోని దాదాపు 5,000 గదులు 90 శాతం ఆక్యుపెన్సీతో నిండిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఏపీ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్ కార్తీక్ తెలిపారు.