News June 23, 2024
వేటపాలెం: సముద్ర స్నానానికి వచ్చి ఇద్దరు యువకుల మృతి

వేటపాలెంలో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరికి చెందిన 12 మంది యువకులు వేటపాలెం మండలంలోని రామాపురం బీచ్‌కు వెళ్లారు. వీరంతా సముద్ర స్నానానికి దిగగా.. అందులో ఇద్దరు మృతిచెందారు. చనిపోయిన వారిని బాలసాయి(26), బాలనాగేశ్వరరావు(27)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 18, 2025
20న ఒంగోలులో వ్యాసరచన పోటీలు: DEO

ఒంగోలులోని బండ్లమిట్ట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల 20వ తేదీన వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో రేణుక తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకొని పోటీలను నిర్వహిస్తున్నామని గెలిచిన విజేతలకు రూ.5000, రూ.3000, రూ.2000 బహుమతులు అందిస్తామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని ఆమె తెలిపారు.
News December 18, 2025
రేపు ఒంగోలులో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

ఒంగోలులోని సాయిబాబా సెంట్రల్ స్కూల్ ఆవరణంలో 19న శుక్రవారం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డీఈవో రేణుక తెలిపారు. ఒంగోలులోని డీఈవో కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులను వైజ్ఞానిక పరంగా ప్రోత్సహించేందుకు ఈ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రదర్శన అనంతరం సాయంత్రం బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుందని తెలిపారు.
News December 18, 2025
పొన్నలూరు: బాకీ డబ్బుల కోసం మహిళ నిరసన.!

పొన్నలూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదంటూ మధురైకి చెందిన మహిళ గురువారం అతని ఇంటి ఎదురుగా నిరసనకు దిగింది. తమ నుంచి రూ.68 లక్షలు తీసుకొని, చెల్లించాల్సిన ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించడం లేదంటూ మధురై నుంచి వచ్చి నిరసన తెలిపింది. సదరు వ్యక్తి లేకపోవడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అనూక్ మాట్లాడి నిరసన విరమింపజేశారు.


