News March 5, 2025
వేట్లపాలెం: ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సోమవారం వేట్లపాలెం పాఠశాలలో విచారణ నిర్వహించారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Similar News
News January 7, 2026
WGL: కుక్కలు అడ్డు వచ్చి ఇద్దరు మృతి

జిల్లాలోని గీసుగొండలో కుక్కల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఒకే మండలానికి చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. ఎలుకుర్తి హవేలీకి చెందిన ఆడెపు శివ ఇటీవల మచ్చపూర్ వద్ద కుక్క అడ్డు రావడంతో జరిగిన ప్రమాదంలో మృతి చెందగా, ఆ విషాదం మరువక ముందే గంగదేవిపల్లికి చెందిన గూడ సంతోశ్ కుమార్ ధర్మారం వద్ద నిన్న కుక్క కారణంగా ప్రాణాలు విడిచారు.
News January 7, 2026
ఖమ్మం: మిర్చి ధర ఢమాల్.. రీజన్ ఇదే..!

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మిర్చి పోటెత్తుతోంది. నిత్యం సుమారు 30 వేల బస్తాల వరకు వస్తోంది. మంగళవారం మార్కెట్‌లో క్వింటా మిర్చి గరిష్ఠ ధర రూ.14,800గా నమోదైంది. ఎకరాకు రూ.1.50లక్షల వరకు పెట్టుబడి పెట్టినా గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైనా వంటి దేశాల నుంచి ఎగుమతులు మందగించడమే ఈ ధరల పతనానికి కారణంగా తెలుస్తోంది. కనీసం రూ.20 వేల ధర లభిస్తేనే లాభదాయకమని రైతులు అంటున్నారు.
News January 7, 2026
పార్వతీపురం: ఈనెల 9న జిల్లా స్థాయి డాన్స్ పోటీలు

జిల్లా స్థాయి డాన్స్ పోటీలను ఈ నెల 9న నిర్వహిస్తామని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా డాన్స్ పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 15 సంవత్సరాలు లోపు ఒక కేటగిరీ, 15 సంవత్సరాలు దాటిన వారికి రెండో కేటగిరీగా విభజించి, గిరిజన, జానపద, దేశభక్తి నృత్యాలు కేటగిరిలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు.


