News February 28, 2026

వేట్లపాలెం దుర్ఘటనపై MP ఉదయ్ దిగ్భ్రాంతి

image

సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుడు అత్యంత దురదృష్టకరమని కాకినాడ MP ఉదయ శ్రీనివాస్ శనివారం పేర్కొన్నారు. ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆయన సహాయక చర్యల్లో పాల్గొన్నారు. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బాధితులకు అండగా ఉంటున్నట్లు వెల్లడించారు. ఈ ఘోర ఘటనపై ఇప్పటికే శాఖాపరమైన విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News March 3, 2026

TODAY HEADLINES

image

✦ మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం.. ఖమేనీ భార్య మృతి
✦ మేం యుద్ధాన్ని స్టార్ట్ చేయలేదు కానీ ముగిస్తాం: US
✦ సౌదీ, బహ్రెయిన్, ఇజ్రాయెల్ పాలకులకు పీఎం మోదీ ఫోన్
✦ HPV వ్యాక్సిన్ సురక్షితమే: కేంద్రం
✦ యుద్ధం వల్ల కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. రూ.లక్షల కోట్లు ఆవిరి
✦ నిజాయతీ కలిగిన అధికారులకే అవకాశం: CM CBN
✦ దేశం కోసం రాహుల్ ప్రధాని కావాల్సిందే: CM రేవంత్

News March 3, 2026

ఇరాన్ మౌనంగా ఉండదు.. అధ్యక్షుడి వార్నింగ్

image

అమెరికా-ఇజ్రాయెల్ మానవత్వ విలువలను పట్టించుకోవట్లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ విమర్శించారు. ఆస్పత్రులు, దేశ భవిష్యత్ అయిన స్కూళ్లను టార్గెట్ చేసుకున్నారని ట్వీట్ చేశారు. రోగులు, పిల్లలపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. ప్రపంచమంతా దీన్ని ఖండించాలని, తాను దేశం తరఫున నిలబడతానని స్పష్టం చేశారు. ఇరాన్ ఇలాంటి నేరాలకు లొంగిపోదని, మౌనంగా ఉండదని హెచ్చరించారు.

News March 3, 2026

రూ.1000 కోట్లతో ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు!

image

TG: రాష్ట్రంలోని అద్దె గృహాల్లో ఉన్న ఆఫీసులకు దశలవారీగా సొంత భవనాలు నిర్మించాలని GOVT నిర్ణయించింది. తద్వారా చెల్లిస్తున్న కోట్లాది రూపాయలు అద్దెల భారాన్ని తగ్గించుకోనుంది. మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆఫీసులు అద్దె భవనాల్లో ఉండడానికి వీల్లేదని, వాటికి నిర్ణీత విస్తీర్ణంలో సొంత భవనాలు నిర్మించాలని CM ఇప్పటికే అధికారులను ఆదేశించారు. వచ్చే బడ్జెట్లో వీటికి ₹1000 CR నిధులు కేటాయించనున్నారు.