News January 8, 2026

వేదాంత గ్రూప్ ఛైర్మన్ కుమారుడు గుండెపోటుతో మృతి

image

వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేశ్ (49) గుండెపోటుతో మృతి చెందారు. అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదం తర్వాత హాస్పిటల్‌లో కోలుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ అగర్వాల్ వెల్లడించారు. “ఈ రోజు నా జీవితంలో అత్యంత చీకటి రోజు” అని అన్నారు. తన కొడుకు ఎప్పుడూ ప్రశాంతంగా, అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

Similar News

News February 22, 2026

శ్రీలీలకు బంపర్ ఆఫర్: అజిత్ సరసన క్రేజీ ఛాన్స్!

image

తెలుగు స్టార్ హీరోయిన్ శ్రీలీలకు తమిళంలో అద్భుతమైన అవకాశం దక్కినట్లు సమాచారం. కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ నటిస్తున్న ‘AK64’ చిత్రంలో ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.

News February 22, 2026

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి వర్షాలు

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. APలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని అంచనా వేసింది. TGలోని ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ సహా 18 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News February 22, 2026

నట్టింట్లో తల చిక్కు తీయకండి

image

ఇంటి మధ్య భాగాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. అక్కడ తల దువ్వితే వెంట్రుకలు రాలి ఇంట్లోనే పడతాయి. ఇల్లంతా వ్యాపిస్తాయి. తినే ఆహారంలోనూ పడే ఛాన్సుంది. వస్తువులపై పడే అవకాశం కూడా ఉంది. ఇది అశుభ్రతకు దారితీస్తుంది. ఆధ్యాత్మికంగా లక్ష్మీదేవి నివసించే చోట ఇలా చేయకూడదు. ఇది దారిద్రానికి హేతువని పండితులు చెబుతారు. విడిగా ఒక గదిలో/బాత్రూంలో తల దువ్వుకోవాలి. తద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం.