News September 21, 2025
వేములవాడలో ‘బతుకమ్మ.. 7 రోజులే’!

ఉమ్మడి KNRలో నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నయి. సాధారణంగా అన్నిచోట్ల ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు బతుకమ్మను జరుపుకుంటారు. కానీ, రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా వేములవాడలో మాత్రం 7 రోజులే ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఇక్కడ ఏడో రోజైన వేపకాయల బతుకమ్మను సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. కాగా, ఇక్కడి ఆడపడుచులు పుట్టింటితో పాటు మెట్టినింటిలో బతుకమ్మను ఆడటం వారి అదృష్టంగా భావిస్తారు.
Similar News
News September 21, 2025
గాజులరామరంలో పేదల ఇళ్లు కూల్చం: రంగనాథ్

గాజులరామారంలో భారీగా కబ్జాలపై హైడ్రా కమీషనర్ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు. 317 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతలు, అధికారులు ఆక్రమించిన భూములను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుందన్నారు. పేదలఇళ్లను కూల్చొద్దని ఫీల్డ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఇప్పటికే రూ.20కోట్ల విలువగల 275 ఎకరాలకుపైగా భూమిని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేశామన్నారు.
News September 21, 2025
సిద్దిపేట జిల్లాలో డెంగ్యూ కేసులు కలకలం

సిద్దిపేట జిల్లాలో డెంగ్యూ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల డెంగ్యూ జ్వరంతో జగదేవ్పూర్ మండానికి చెందిన ఇంటర్ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. దుబ్బాక నియోజకవర్గంలో కూడా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గజ్వేల్ మండలానికి చెందిన బాలుడు నిన్న నీలోఫర్ హాస్పిటల్‌లో డెంగ్యూ చికిత్స పొందుతూ మృతి చెందారు. అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
News September 21, 2025
కర్నూలులో రూ.100కే 45 కిలోల ఉల్లి: కలెక్టర్

మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన 14 వేల క్వింటాళ్ల ఉల్లిని రూ.100కే 45 కిలోలు విక్రయిస్తున్నామని, వినియోగదారులు, వ్యాపారులు వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సిరి వెల్లడించారు. ఆదివారం కర్నూలు మార్కెట్ యార్డును జేసీ నవ్యతో కలిసి ఆమె పరిశీలించారు. రైతులకు హెక్టార్‌కు రూ.50 వేలు పరిహారం ఇస్తున్నందున ఈనెల 22 నుంచి మద్దతు ధర రూ.1,200 కలిపి వేస్తున్నామన్నారు.