News November 20, 2025
వేములవాడలో మరిన్ని సూచిక బోర్డుల ఏర్పాటు

వేములవాడ పుణ్యక్షేత్రంలో అధికారులు కొత్తగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. భీమేశ్వర ఆలయంలో దర్శనాల నేపథ్యంలో దారితెలియక భక్తులు తికమకపడుతున్నారు. దీనికి తోడు అభివృద్ధి పనుల కారణంగా పలుచోట్ల ట్రాఫిక్‌ను మళ్లించి ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తిప్పాపూర్ బ్రిడ్జితో పాటు పట్టణంలోకి ప్రవేశించే రోడ్లు, ముఖ్య కూడళ్ల వద్ద ముఖ్యమైన ప్రాంతాలకు దారులను సూచిస్తూ పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
Similar News
News November 23, 2025
యథావిధిగా అమలాపురంలో ‘పీజీఆర్‌ఎస్’ : కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈ నెల 24 సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో, అలాగే ఆర్డీవో కార్యాలయాలు, మండల స్థాయిలో ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కలెక్టర్ కోరారు.
News November 23, 2025
KMR: రైలు ఢీకొని 80 గొర్రెల మృతి.. కాపరి గల్లంతు

కామారెడ్డి రైల్వే ట్రాక్ సమీపంలో ఆదివారం రైలు ఢీకొని సుమారు 80 గొర్రెలు మృతి చెందాయి. రైలు రాకను గమనించి వాటిని కాపాడుకునే ప్రయత్నంలో గొర్రెల కాపరి సురేష్ పెద్ద వాగులోకి దూకారు. అయితే, ఆయనతో పాటు ఉన్న మరో కాపరి, 35 ఏళ్ల ధర్షపు సుధాకర్, ఈత రాకపోవడంతో వాగులో గల్లంతయ్యారు. సుధాకర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 23, 2025
సిరిసిల్ల డీఎస్పీగా నాగేంద్ర చారి నియామకం

సిరిసిల్ల సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా కే.నాగేంద్ర చారి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. నిజామాబాద్ సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్న నాగేంద్ర చారిని సిరిసిల్లకు బదిలీ చేశారు. నాగేంద్ర చారి గతంలో వేములవాడ డీఎస్పీగా విధులు నిర్వర్తించారు.


