News January 11, 2026
వేములవాడ: ఆర్టీసీ బస్సుల్లో సంక్రాంతి అదనపు ఛార్జీలు

సంక్రాంతి పండుగ పేరిట ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణ సమయంలో సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి వేములవాడకు డీలక్స్ బస్సు టికెట్ రూ.250 ఉండగా, పండుగ స్పెషల్ పేరిట నిర్వహిస్తున్న బస్సుల్లో రూ.350 అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు.
Similar News
News February 20, 2026
ఏఐ వార్‌రూమ్‌కు HYD అనువైన ప్రదేశం: CM రేవంత్

హైదరాబాద్ వచ్చి ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో టెక్నాలజీ దిగ్గజాలను TG CM రేవంత్ కోరారు. ‘ఏఐ శకం ఇప్పటికే మొదలైంది. మనిషి కంటే ఇది ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంది. భారతీయులు ఎక్కువగా సోషల్ మీడియా వాడతారు. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలి. ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలి. అందుకు హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశం’ అని సీఎం వివరించారు.
News February 20, 2026
రాజకీయాల్లోకి భార్య, పిల్లలను లాగొద్దు: ప్రియాంక

కాంగ్రెస్ MP గౌరవ్ గొగొయ్, ఆయన భార్య ఎలిజబెత్‌కు పాక్ ఏజెంట్‌తో <<19086206>>సంబంధాలున్నాయంటూ<<>> అస్సాం సీఎం హిమంత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత ప్రియాంక ఫైరయ్యారు. రాజకీయాల్లోకి భార్య, పిల్లలను లాగడం దుర్మార్గమన్నారు. ఎవరూ ఇలా చేయకూడదని స్పష్టం చేశారు. గౌరవ్ సానుకూల, ప్రేమపూర్వక రాజకీయాలు చేస్తారని పేర్కొన్నారు. CM అనవసర విమర్శలు వదిలేసి ప్రజా సమస్యలపై దృష్టిసారించాలని హితవు పలికారు.
News February 20, 2026
భద్రాద్రి: ప్రభుత్వ ఐటీఐలో షార్ట్ టర్మ్ శిక్షణ

ప్రభుత్వ ఐటీఐలో షార్ట్ టర్మ్‌లో ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వ శిక్షణ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిందని కొత్తగూడెం ప్రిన్సిపల్ రమేశ్ తెలిపారు. పీఎంకేవీవై ద్వారా సీఎన్సీ ఆపరేటర్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నీషియన్, 3D ప్రింటర్ కోర్సులకు కొత్తగూడెంలో, సీఎన్సీ ప్రోగ్రామర్, ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులకు కృష్ణ సాగర్, మణుగూరు ఐటీఐలో శిక్షణ ఉంటుందని చెప్పారు. సమీప ఐటీఐని సంప్రదించాలన్నారు.


