News January 7, 2026

వేములవాడ: ఆలయ ఆవరణలో బహిరంగ వేలం

image

వేములవాడ మండలం అగ్రహారంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో టెంకాయలు, పూజ సామానులు, దీక్ష సామానులు అమ్ముకొనుటకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నామని ఆలయ కార్య నిర్వహణ అధికారి తెలిపారు. వేములవాడ మండలం అగ్రహారంలో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17న ఉదయం 11 గంటలకు దేవాలయ ఆవరణలో వేలం నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గలవారు వేలంలో పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 8, 2026

భారత మాజీ కోచ్‌లపై కన్నేసిన శ్రీలంక

image

T20 WCలో రాణించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు పలు కీలక నియామకాలు చేపడుతోంది. ఇప్పటికే టీమ్ ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌ను అపాయింట్ చేసుకున్న ఆ జట్టు, తాజాగా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌నూ తాత్కాలిక బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. JAN 18 నుంచి MAR 10 వరకు ఆయన SL జట్టుకు కోచ్‌గా ఉండనున్నారు. ఫిబ్రవరి 7న WC ప్రారంభం కానుంది. కాగా IPLలో RR టీమ్‌కు విక్రమ్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నారు.

News January 8, 2026

ఇమ్యునిటీని పెంచే బ్రేక్ ఫాస్ట్

image

అల్పాహారంలో హెల్తీ ఫుడ్స్‌ని చేర్చుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాటిల్లో ముఖ్యమైనవి గుడ్లు, చిలగడదుంప, ఓట్స్ అంటున్నారు నిపుణులు. ఓట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్, మినరల్స్, ఫైబర్, బీటా-గ్లూకాన్ ఉంటాయి. గుడ్లలో విటమిన్ డి, జింక్, సెలీనియం, విటమిన్ ఈ, చిలగడ దుంపలో కాల్షియం, మెగ్నీషియం, థయామిన్, జింక్, విటమిన్లు ,మినరల్స్ ఉంటాయి.

News January 8, 2026

బాల్యం ‘బట్టీ’ పాలు కావొద్దు: అడిషనల్ ఎస్పీ

image

జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు నడుం బిగించారు. ఇటుక బట్టీల్లో చిన్న పిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ రమేష్ స్పష్టం చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో బట్టీల యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు.