News March 29, 2025

వేములవాడ: ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయుటకు ఇద్దరు గైనకాలజిస్టులు, ముగ్గురు డ్యూటీ డాక్టర్లు గంభీరావుపేటలో ఒక జనరల్ ఫిజీషియన్ పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సూపర్డెంట్ పెంచలయ్య తెలిపారు. వేములవాడ పట్టణంలో శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 2వ తేదీన కలెక్టరేట్లో జరిగే ఇంటర్వ్యూకి హాజరు కావాలన్నారు.

Similar News

News March 31, 2025

NGKL: తెలకపల్లిలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 25 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా.. అత్యధికంగా తెలకపల్లి, పెద్దకొత్తపల్లిలో 40.1 డిగ్రీలో ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే పెద్దూర్ 40.0, పెంట్లవెల్లి, కొల్లాపూర్ 39.9, కల్వకుర్తి, వంగూర్ 39.8, చారకొండ, ఉప్పునుంతల 39.7, వెల్దండ, అచ్చంపేట 39.6, నాగర్ కర్నూల్ 38.9, అమ్రాబాద్ 38.8, తాడూర్ 38.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

News March 31, 2025

అరుణాచల్ ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం

image

ఇవాళ మధ్యాహ్నం 2.38 గంటలకు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని షియోమీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూప్రకంపనలకు భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్ సహా భారత్‌లోని మేఘాలయ, కోల్‌కతా, ఢిల్లీలోనూ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

News March 31, 2025

మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ.. ఎవరీమె?

image

PM మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా IFS అధికారిణి నిధి తివారీ నియమితులయ్యారు. 2014 బ్యాచ్‌(UP)కు చెందిన ఈమె తొలుత వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు. ఆ తర్వాత విదేశాంగ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2022లో PMOలో అండర్ సెకట్రరీగా చేరి డిప్యూటీ సెక్రటరీగా ప్రమోషన్‌ పొందారు. అంతర్జాతీయ సంబంధాల్లో ఉన్న నైపుణ్యంతో ఆమె ఇప్పుడు 35 ఏళ్లకే PMOలో కీలక స్థాయికి వచ్చారు.

error: Content is protected !!