News February 3, 2025

వేములవాడ: నేడు అఘోరి వస్తుందా..? రాదా..?

image

గతంలో అఘోరి చేసిన వ్యాఖ్యలతో నేడు ఏం జరగనుందో అని అంతటా చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లేడీ అఘోరి ఫిబ్రవరి 3న వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చి ఆలయంలోని దర్గాను కూల్చివేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి వేములవాడ వైపు మళ్లింది. అఘోరి చెప్పినట్లుగా నేడు నిజంగా ఆమె వేములవాడకు వస్తుందా..? రాదా..? అనేది  మరికొద్దిసేపట్లో తెలవనుంది.

Similar News

News July 7, 2025

KU పరిధిలో 2,356 సీట్లు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 2,356 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరిధిలోని రెండు కాలేజీల్లో 780 సీట్లు ఉండగా.. నాలుగు ప్రైవేట్ కాలేజీల్లో 1,576 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 1,103 సీట్లను భర్తీ చేయనున్నారు. టీజీఎప్‌సెట్-2025 ఫస్ట్ ఫేజ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈ నెల 8 వరకు అవకాశం ఉండగా.. వెబ్ ఆప్షన్లకు 10 వరకు గడువు ఉంది.

News July 7, 2025

ప్రకాశం జిల్లా తొలి కలెక్టర్ ఎవరో తెలుసా?

image

1972లో ప్రకాశం జిల్లా ఏర్పాటైంది. తొలి కలెక్టర్‌గా కత్తి చంద్రయ్య వ్యవహరించారు. నాగులుప్పులపాడు(M) పోతవరంలో 1924 జులై 7న ఆయన జన్మించారు. మద్రాసులో లా పూర్తి చేసి మధురై జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్, గుంటూరు కలెక్టర్‌గానూ వ్యవహరించారు. ఆయన కుమారుడు, కుమార్తె రత్నప్రభ, ప్రదీప్ చంద్ర సైతం IASలే. తండ్రి, కుమారుడు ఒకే జిల్లా(గుంటూరు)కు కలెక్టర్‌గా పనిచేయడం మరొక విశేషం.

News July 7, 2025

నూజివీడు IIITలో 141 సీట్లు ఖాళీ

image

నూజివీడు IIIT క్యాంపస్‌కు సంబంధించి మొదటి విడత సీట్ల భర్తీ పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 869 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 141 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11, 12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.