News February 2, 2025
వేములవాడ: పులి పుకార్లను నమ్మవద్దు: డీఎఫ్‌వో

పులి దొరికిందన్న పుకార్లను నమ్మవద్దని జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి అన్నారు. మండలంలో పులి సంచారం ఉందన్న సమాచారం మేరకు నూకలమర్రి గ్రామ శివారులో పలు ప్రాంతాలను సిబ్బందితో కలిసి ఆమె శనివారం పరిశీలించారు. అనంతరం వేములవాడలోని అటవీశాఖ కార్యాలయంలో డీఎఫ్‌వో మాట్లాడుతూ.. పులి సంచారంపై గ్రామాల ప్రజలందరూ ఆందోళన చెందవద్దన్నారు. పొలాలకు వెళ్లే రైతులు అటవీశాఖ అధికారులు సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
Similar News
News March 10, 2025
కెప్టెన్‌గా రోహిత్ శర్మ గెలిచిన ట్రోఫీలు ఇవే

☞ IPL: 2013, 2015, 2017, 2019, 2020 (MI)
☞ CL టీ20: 2013
☞ ఆసియా కప్: 2018, 2023
☞ నిదహాస్ ట్రోఫీ-2018
☞ టీ20 వరల్డ్ కప్-2024
☞ ఛాంపియన్స్ ట్రోఫీ-2025
News March 10, 2025
NZ అంటే చాలు.. రెచ్చిపోతాడు!

వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌పై భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆ జట్టుపై శ్రేయస్ వరుసగా 103, 52, 62, 80, 49, 33, 105, 79, 48 రన్స్ చేశారు. అలాగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు (243) చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. ఈ టోర్నీలో ఆయన 15, 56, 79, 45, 48 రన్స్ సాధించారు.
News March 9, 2025
భారత జట్టుకు అభినందనల వెల్లువ

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. టీమ్ ఇండియా మరోసారి తన సత్తా చాటిందని, గర్వపడేలా చేసిందని AP సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.