News December 11, 2025
వేములవాడ: పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని 76 సర్పంచ్, 519 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ మండలాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు.
Similar News
News December 12, 2025
ములుగు జిల్లాలో FINAL పోలింగ్ శాతం

జిల్లాలో 48 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రం లోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 78.65 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
News December 12, 2025
కామారెడ్డి జిల్లాలో FINAL పోలింగ్ శాతం

కామారెడ్డి జిల్లాలో మొదటి విడత జీపీ ఎన్నికలు గురువారంతో ప్రశాంత వాతావరణంలో ముగిశాయని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 79.40 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ వెల్లడించారు. 10 మండలాల్లోని సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన పోలింగ్‌ను కలెక్టర్, ఐడీసీలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా, అలాగే పలు పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించి పర్యవేక్షించారు.
News December 12, 2025
బొగ్గు పొయ్యిలపై తందూరీ వద్దు!

ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు బొగ్గు పొయ్యిలపై తందూరీ తయారీని నిషేధించారు. హోటల్స్, దాబాలు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో కట్టెల పొయ్యిలనూ వాడొద్దని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ ఆదేశించింది. రూల్స్ అతిక్రమిస్తే భారీగా ఫైన్ వేస్తామని హెచ్చరించింది. ఢిల్లీలోని లజపత్‌నగర్, కరోల్‌బాగ్, సుభాష్ నగర్ తందూరీ, టిక్కాలకు ఫేమస్. తాజా ఆదేశాలతో అక్కడ బొగ్గుల స్థానంలో గ్యాస్, ఎలక్ట్రిక్ పొయ్యిలు వాడుతున్నారు.


