News September 20, 2025

వేములవాడ: ‘ప్రతి మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించాలి’

image

ప్రతి మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వేములవాడ మండలం చీర్లవంచ, RR కాలనీలోని ‘స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. మహిళలకు వైద్య పరీక్షలు ఎలా చేస్తున్నారని ఆరా తీశారు. జిల్లాలోని అన్ని PHC, అర్బన్ హెల్త్ సెంటర్, ఏరియా హాస్పిటల్, బస్తీ దవఖానాలు, మొత్తం 82 ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేస్తారని ఆయన వివరించారు.

Similar News

News September 20, 2025

విజయనగరంలో దంపతుల ఆత్మహత్య

image

విజయనగరం వీటీ అగ్రహారంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అగ్రహారంలో నివాసముంటున్న కానూరి పార్వతి (55), సత్యనారాయణ(62) కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి ఇంట్లో పడుకున్నారు. ఉదయం ఎంతకీ లేవకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ ఎస్‌ఐ అశోక్ కుమార్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. వారు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలింది.

News September 20, 2025

బోయినపల్లిలో రియల్ ఎస్టేట్ మోసం.. భార్యాభర్తల అరెస్ట్

image

రియల్ ఎస్టేట్ మోసానికి పాల్పడిన దంపతులను బోయిన్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగి ప్రాంతానికి చెందిన పరశురాములు, ఆయన భార్య మాధవి ‘స్కంద శ్రీ ఇన్ఫ్రా డెవలపర్స్’ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి రమ్య, వీణ అనే మహిళల నుంచి రూ.22.50 లక్షలు వసూలు చేశారు. డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా బెదిరించడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

News September 20, 2025

కాజీపేట రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని మృతదేహం

image

దిల్లీ నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే రైల్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడని 108 సిబ్బందికి రైల్లో ప్రయాణికులు సమాచారం ఇచ్చారు. దీంతో హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్లో 108 సిబ్బంది ఈఎంటీ చైతన్య, రైల్వే డాక్టర్లు పరిశీలించారు. అప్పటికే ఆ ప్రయాణికుడు మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంలోని మార్చురీకి తరలించారు. దీనిపై రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు.