News December 25, 2025

వేములవాడ భీమేశ్వరాలయంలో బ్లాక్‌లో దర్శనాల దందా

image

వేములవాడ భీమన్న ఆలయంలో బ్లాక్‌లో దర్శనాల దందా కొనసాగుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. మేడారం జాతర నేపథ్యంలో భక్తుల రద్దీ పెరగడాన్ని ఆసరాగా చేసుకుని వరంగల్‌కు చెందిన భక్తుల వద్ద రూ.300 చొప్పున వసూలు చేసి దర్శనం కోసం తీసుకువెళ్తున్నట్లు ఆలయ SPF సిబ్బంది గుర్తించి వారిని పట్టుకున్నారు. బ్లాక్ దందాకు పాల్పడుతున్న యువకుడిని చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీ వాసిగా గుర్తించారు.

Similar News

News December 25, 2025

గోపాలపురం: రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టుకు యశశ్రీ ఎంపిక

image

గోపాలపురం(M) పెద్దాపురం గ్రామానికి చెందిన తానింకి యశశ్రీ రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపికైంది. గన్నవరంలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 బాలికల పోటీల్లో ఆమె ప్రతిభ కనబరిచింది. యశశ్రీ విజయం పట్ల పెద్దాపురం గ్రామస్థులు గురువారం హర్షం వ్యక్తం చేశారు. కుమార్తెకు చిన్ననాటి నుంచి క్రికెట్ పై ఉన్న ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించామని తండ్రి సత్తిబాబు ఈ సందర్భంగా ఆనందాన్ని పంచుకున్నారు.

News December 25, 2025

కరుణ, ప్రేమే క్రిస్మస్ సందేశం: ఎస్పీ

image

క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జిల్లా ప్రజలందరికీ క్రైస్తవ సోదరీసోదరులకు వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ.. శాంతి, కరుణ, ప్రేమ, సహనానికి ప్రతీకగా నిలిచే ఏసుప్రభువు బోధనలు సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆమె కోరారు.

News December 25, 2025

వాట్సాప్ ‘బ్లాక్’ మిస్టరీ: ఆ నంబర్ల డేటా కోరిన ప్రభుత్వం!

image

ఈ ఏడాది ప్రతినెలా సగటున కోటి ఇండియన్ అకౌంట్స్‌ను వాట్సాప్‌ బ్లాక్ చేసింది. ఆన్‌లైన్ ఫ్రాడ్స్, స్కామ్స్ పెరగడమే దీనికి కారణం. అయితే ఏ నంబర్లను బ్యాన్ చేశారో ప్రభుత్వంతో షేర్ చేయడం లేదు. డిజిటల్ అరెస్ట్ వంటి స్కామ్స్ వాట్సాప్ ద్వారానే జరుగుతున్నాయి. సిమ్ కార్డు లేకపోయినా ఇవి పనిచేస్తాయి. కాబట్టి నిందితులను పట్టుకోవడం సవాలుగా మారింది. అందుకే బ్యాన్ చేసిన నంబర్ల వివరాలను ప్రభుత్వం కోరుతోంది.