News January 1, 2026

వేములవాడ: మంత్రికి ప్రసాదం అందజేసిన ఎమ్మెల్యే

image

రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శ్రీస్వామి వారి ప్రసాదం అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయం పక్షాన శ్రీ స్వామివారి ప్రసాదాన్ని మంత్రికి అందజేశారు.

Similar News

News January 8, 2026

మహబూబాబాద్ ఆసుపత్రిలో సైకో వీరంగం

image

మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో గురువారం బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి కత్తులతో హల్‌చల్ చేశాడు. వైద్యం కోసం వచ్చిన ఆ వ్యక్తి ఒక్కసారిగా సైకోలా మారి ఆసుపత్రిలోని వస్తువులను ధ్వంసం చేస్తూ, కత్తితో పొడుస్తానంటూ రోగులను బెదిరించాడు. దీంతో రోగులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి గొంతు కోసుకోవడానికి ప్రయత్నించగా, సెక్యూరిటీ సిబ్బంది తలుపులు పగలగొట్టి అతడిని బంధించారు.

News January 8, 2026

క్రమ పద్ధతిలో హిందువులపై దాడులు: షేక్ హసీనా

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. అక్కడ మైనారిటీలపై ఒక క్రమ పద్ధతిలో దాడులు జరుగుతున్నాయని NDTVతో చెప్పారు. ఈ హింసను యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వమే అనుమతిస్తోందని ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. శిక్ష పడుతుందనే భయం దోషుల్లో లేకుండా పోయిందన్నారు.

News January 8, 2026

ఉప్పలపాడులో పాస్ పుస్తకాలను అందజేసిన కలెక్టర్

image

ముదిగుబ్బ మండలం ఉప్పలపాడులో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. భూ రికార్డుల పారదర్శకతతో రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.