News February 15, 2026
వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

వేములవాడ పురపాలక సంఘం కార్యాలయ భవనంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌కు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ఏర్పాట్లను ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఆర్డీవో రాదాబాయి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్‌తో కలిసి సమావేశ మందిరంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News February 16, 2026
MBNR: ఆదర్శం.. రాజ్యాంగం సాక్షిగా ఒక్కటైన జంట

మహబూబ్‌నగర్ జిల్లా శేరిపల్లిలో మతాచారాలు, ఆడంబరాలకు భిన్నంగా రాజ్యాంగం సాక్షిగా వివాహం జరిగింది. రిబుకా, ఉదయ్ అనే నూతన జంట రాజ్యాంగంపై ప్రమాణం చేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ వినూత్న వేడుకలో తెలంగాణ విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు, రెండు కుటుంబాల సభ్యులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ ఆదర్శ వివాహం స్థానికంగా చర్చనీయాంశమైంది.
News February 16, 2026
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేయర్, ఛైర్మన్‌ల ఎన్నిక

ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లో మేయర్/ఛైర్మన్‌లతో పాటు డిప్యూటీ మేయర్/వైస్ ఛైర్మన్‌ల ఎన్నిక జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ప్రత్యేక సమావేశం జరిపి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల/కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఎన్నిక జరుపుతారు.
News February 16, 2026
రాహుల్ అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు: అమిత్ షా

USతో ట్రేడ్ డీల్‌తో కేంద్రం రైతులకు <<19151159>>ద్రోహం చేస్తోందని<<>> రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు. రాహుల్ అబద్ధాలు వ్యాప్తి చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను పూర్తిగా రక్షిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. రైతుల గురించి పార్లమెంటులో రాహుల్ మాట్లాడుతుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు.


