News January 24, 2026

వేములవాడ: మున్సిపాలిటీ నుంచి పంచాయతీకి.. మళ్ళీ పురపాలికగా

image

ఇప్పటి వేములవాడ మున్సిపాలిటీ ఆరు దశాబ్దాల కింద కూడా మున్సిపాలిటీగా ఉండేది. 1965 వరకు మున్సిపాలిటీగా కొనసాగిన వేములవాడను ఆ తర్వాత గ్రామపంచాయతీగా మార్చారు. ఆ తర్వాత మేజర్ పంచాయతీగా మారిన వేములవాడను 2011లో నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ చేశారు. 2018లో మూడో శ్రేణి మున్సిపాలిటీగా మార్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న వేములవాడలో ప్రస్తుతం సుమారు 60 వేల జనాభా ఉండగా, 40877 మంది ఓటర్లు ఉన్నారు.

Similar News

News February 18, 2026

ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తత

image

AP: విశాఖ AUలో ఉద్రిక్తత నెలకొంది. SFIకి వ్యతిరేకంగా ABVP కార్యకర్తలు నినాదాలు చేస్తూ VC ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే టైమ్‌లో SFI నేతలు అక్కడికి వచ్చి ప్రతినినాదాలు చేయడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు రాకుండా మెయిన్ గేటుకు తాళాలు వేశారు. AUలో నిన్న RSS మార్చ్‌ను SFI అడ్డుకున్న నేపథ్యంలో వివాదం ఏర్పడింది.

News February 18, 2026

ప్లీట్ రివ్యూలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ దంపతులు

image

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని వారు కలిశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, గవర్నర్ నజీర్, కేంద్ర మంత్రులు, నౌకదళ అధిపతులు, విదేశీ ప్రముఖులు పాల్గొన్నారు. యుద్ధనౌకల సామర్థ్యం వివరిస్తూ ఫీట్ రివ్యూ కొనసాగుతోంది.

News February 18, 2026

క్లీనింగ్ టిప్స్ మీ కోసం..

image

* ముత్యాల నగలు మురికిగా అయితే ఆలివ్ నూనెలో ముంచిన దూదితో తుడవండి.
* బట్టలపై నూనె పడితే ఉప్పు అద్దిన నిమ్మకాయతో రుద్దండి.
* షవర్ రంధ్రాలు మూసుకుపోతే, వైట్ వెనిగర్‌తో శుభ్రం చేసుకోవచ్చు.
* ఫ్రిజ్ లోపల దుర్వాసన వస్తోంటే వంటసోడాలో కాసిని నీళ్ళు కలిపి తుడిస్తే సరిపోతుంది.
* బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో కీరదోసను ముక్కలుగా కోసి పెడితే, వాటి బెడద తగ్గుతుంది.