News February 27, 2025
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఎస్పీ అఖిల్ మహాజన్

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఎస్పీ అఖిల్ మహాజన్ దంపతులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కోడి మొక్కలు చెల్లించుకున్నారు. శివరాత్రి రోజు దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ఆలయ సిబ్బంది పాల్గొన్నారు
Similar News
News November 3, 2025
ఎన్ని అవాంతరాలు ఎదురైనా SLBC పూర్తి చేస్తాం: CM

TG: SLBC టన్నెల్ పనులపై BRS నేతలు రాజకీయాలు చేయడం తగదని CM రేవంత్ అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ మన్నేవారిపల్లిలో పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘SLBC పనులను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. పదేళ్లలో 10kms కూడా పూర్తి చేయలేదు. కమీషన్లు రావని ఈ ప్రాజెక్టును పక్కనపెట్టారు’ అని విమర్శించారు.
News November 3, 2025
₹లక్ష కోట్లతో రీసెర్చ్ ఫండ్.. ప్రారంభించిన మోదీ

టెక్ రెవల్యూషన్‌కు భారత్ సిద్ధంగా ఉందని PM మోదీ అన్నారు. ఇవాళ ఢిల్లీలోని భారత్ మండపంలో ESTIC-2025 కాంక్లేవ్‌ను ప్రారంభించారు. ₹లక్ష కోట్లతో రీసెర్చ్, డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్ (RDI) స్కీమ్ ఫండ్‌ను లాంచ్ చేశారు. ‘ఈ ₹లక్ష కోట్లు మీకోసమే. మీ సామర్థ్యాలను పెంచేందుకు, కొత్త అవకాశాలు సృష్టించేందుకు ఉద్దేశించినవి. ప్రైవేటు సెక్టార్‌లోనూ రీసెర్చ్‌ను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు.
News November 3, 2025
వరంగల్-ఖమ్మం రహదారిపై గ్రానైట్ లారీల బీభత్సం..!

వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై గ్రానైట్ బండల లారీలు తరచూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇటీవల MHBD జిల్లా తొర్రూరులో గ్రానైట్ లారీ డివైడర్‌ను ఢీకొట్టగా, ఫతేపురం వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తాజాగా నాంచారిమడూరు వద్ద లారీ అదుపుతప్పి ఏకంగా ఇంటి ప్రహరీని ఢీకొంది. అధిక బరువుతో లోడ్ అయిన లారీలే ఈ ప్రమాదాలకు కారణమని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


