News December 28, 2025
వేములవాడ: రాజన్న ఆలయంలో ఏకాంతంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 30వ తేదీ మంగళవారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో రాజన్న సన్నిధిలో ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామని, శ్రీ భీమేశ్వరాలయంలో భక్తుల సమక్షంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి నిర్వహిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఆర్జిత సేవలపై పరిమితి విధించినట్లు తెలిపారు.
Similar News
News January 2, 2026
టాప్ స్టోరీస్

* కృష్ణా జలాల అంశంలో KCR, హరీశ్ చేసిన అన్యాయానికి ఉరేసినా తప్పులేదు: CM రేవంత్
* నదీ జలాలపై CMకు కనీస అవగాహన లేదు: KTR
* CMకు బచావత్-బ్రిజేష్ ట్రిబ్యునళ్ల మధ్య తేడా తెలీదు: హరీశ్
* న్యూఇయర్.. AP, TGలో భారీగా పెరిగిన మద్యం విక్రయాలు
* 5 రకాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించిన AP ప్రభుత్వం
* 2027 AUG 15న దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్: కేంద్రం
* OP సిందూర్‌కు రాముడే ఆదర్శం: రాజ్‌నాథ్
News January 2, 2026
IPL: గ్రీన్ కంటే పతిరణకే ఎక్కువ డబ్బులు

IPL మినీ ఆక్షన్‌లో గ్రీన్ (₹25.20Cr), పతిరణ (₹18Cr) అత్యధిక ధర పలికిన టాప్-2 ఆటగాళ్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే గ్రీన్ కంటే పతిరణకే ఎక్కువ డబ్బులు రానున్నాయి. ఓవర్సీస్ ప్లేయర్ల ఫీజు విషయంలో <<18572248>>BCCI పెట్టిన లిమిట్<<>> వల్ల గ్రీన్‌కు ₹18Cr మాత్రమే దక్కుతాయి. అందులో IND+AUS ట్యాక్సులు పోగా ఆయనకు మిగిలేది ₹9.9కోట్లే. అటు SL బౌలర్ పతిరణకు ట్యాక్సులు తీసేయగా ₹12.9 కోట్లు మిగులుతాయి.
News January 2, 2026
జగిత్యాల: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: ఎస్పీ

జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు భద్రత పోస్టర్లను ఆవిష్కరించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, చౌరస్తాలు, బస్టాండ్‌లలో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.


