News April 28, 2024
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోలాహలం

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి, స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వేములవాడ రాజన్న స్వామివారికి పేరుంది.
Similar News
News November 1, 2025
కరీంనగర్: KGBVని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలోగల KGBVని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న Physics Wallah Khan Academy క్లాసులను ఆమె పరిశీలించారు. తరువాత ఇంటర్‌మీడియెట్ మొదటి, రెండో సంవత్సరం BIPC, MPC తరగతులను తనిఖీ చేశారు. కాలేజీలో బోధనా ప్రమాణాలను తెలుసుకొని తగిన సూచనలు చేశారు. విద్యాప్రమాణాల మెరుగుదలపై పాఠశాల సిబ్బందితో అ.కలెక్టర్ చర్చించారు.
News November 1, 2025
కరీంనగర్ సీపీఓగా పూర్ణచంద్రారావు అదనపు బాధ్యతలు

కరీంనగర్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (Chief Planning Officer – CPO)గా పనిచేసిన ఆర్. రాజారాం ఉద్యోగ విరమణ చేయడంతో, ఆ స్థానంలో మంచిర్యాల సీపీఓగా ఉన్న వి. పూర్ణచంద్రారావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆర్థిక, గణాంకాల శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వి. పూర్ణచంద్రారావు శుక్రవారం కరీంనగర్ సీపీఓగా బాధ్యతలు స్వీకరించారు.
News November 1, 2025
నూతన ట్రాఫిక్ స్టేషన్ కార్యాలయాలను ప్రారంభించిన సీపీ

KNR ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనంలో నూతనంగా తీర్చిదిద్దిన ACP, CI, సిటీ రైటర్ కార్యాలయాలను CP గౌస్ అలాం శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ DCP వెంకటరమణ, ACPలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరి స్వామి, వేణుగోపాల్, శ్రీనివాస్ జి, CIలు కరిముల్లా ఖాన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ నిర్వహణను మరింత మెరుగుపరచడానికి ఈ నూతన కార్యాలయాలు దోహదపడతాయని CP పేర్కొన్నారు.


