News October 19, 2025
వేములవాడ రాజన్న ఆలయంలో రేపు దీపావళి వేడుకలు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో నరక చతుర్థిని పురస్కరించుకొని రేపు (ఈనెల 20న ) ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు నరకాసురవధ పురాణ కాలక్షేపం, 6 గంటలకు కల్యాణ మండపంలో ధనలక్ష్మి పూజను ఆలయ అర్చకుల వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News October 19, 2025
జిల్లాలో 287 ధాన్యం కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్

జనగామ: ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేందుకు జిల్లా వ్యాప్తంగా 287 కేంద్రాలు ఏర్పాటు చేశామని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు పక్కా కార్యాచరణ అమలు చేయాలని, అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఇప్పటివరకు 592 మె.ట ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. రైతులకు చెల్లింపులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News October 19, 2025
ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయి: సీఎం

తెలంగాణ ప్రజలకు CM రేవంత్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల ప్రజాపాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని చెప్పారు. పర్యావరణానికి హాని కలిగించకుండా ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ప్రమాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
News October 19, 2025
ధాన్యం కొనుగోళ్లపై పక్కా కార్యచరణ: జనగామ కలెక్టర్

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రతి సీజన్‌లో జిల్లా యంత్రాంగం రికార్డు సృష్టిస్తోందని, అదే స్ఫూర్తితో ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు పక్కాగా కార్యచరణ రూపొందించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాలకు వచ్చే చివరి గింజను కూడా కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.