News December 30, 2024
వేములవాడ: రాజన్న ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అమావాస్య కారణంగా భక్తుల రద్దీ తక్కువైంది. నిత్యం వేలాది మందిగా వచ్చి ఆలయ ధర్మగుండంలో స్థానమాచరించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సారి అమావాస్య సోమవారం కారణంగా బోసిపోయింది. జనం ఎక్కువగా లేకపోవడంతో ఆలయ సిబ్బంది, అర్చకులు ఖాళీగా కనిపించారు.
Similar News
News January 2, 2025
ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రైవేట్ గార్డెన్స్‌లో మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News January 2, 2025
ఎల్లారెడ్డిపేట: యువకుడిపై ఎలుగుబంటి దాడి
ఓ యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన దాడి చేసి గాయపరిచిన ఘటన బుధవారం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుట్టపల్లి చెరువు తండాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. భూక్య నరేశ్ మేకలు కాయడానికి అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే ఓ చెట్ల పొదల్లో దాగి ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా నరేశ్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో అతడి చేతికి గాయం అయింది. స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
News January 2, 2025
కరీంనగర్: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
నూతన సంవత్సరం కొందరి జీవితాల్లో విషాదం నింపింది. వేర్వేరు ప్రమాదాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆరుగురు చనిపోయారు. వివరాలిలా.. బావిలో పడి కూలీ చనిపోగా.. బైక్ అదుపుతప్పి బ్యాంకు ఉద్యోగి మరణించాడు. కరెంట్ షాక్‌తో మహిళ.. గుండెపోటుతో శ్రీనివాస్ రెడ్డి మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి గట్టుబాబు.. మరో ప్రమాదంలో రమణకుమార్ చనిపోయారు.