News November 10, 2025

వేములవాడ: రాజన్న కళ్యాణం.. అరకొర టికెట్లతో నిరాశలో భక్తులు

image

వేములవాడ రాజన్న నిత్యకళ్యాణం టికెట్ల విషయంలో భక్తులు నిరాశకు లోనవుతున్నారు. గతంలో విశాల కళాభవనంలో భక్తులు నిత్యకళ్యాణం మొక్కులు చెల్లించేవారు. ఆలయ విస్తరణ నేపథ్యంలో భీమేశ్వరాలయం ఎదురుగా ఉన్న నిత్యఅన్నదాన సత్రం పైఅంతస్తులో ఈ క్రతువును జరిపిస్తున్నారు. గతంలో 150 జంటలకు టికెట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం దానిని 90కి తగ్గించేశారు. టికెట్లు తీసుకునే సమయంలో ఇక్కడ తోపులాట సైతం జరుగుతుందని పలువురు పేర్కొన్నారు.

Similar News

News November 10, 2025

లైంగిక వేధింపులు ఎదురైతే..

image

బహిరంగ ప్రాంతాల్లో లైంగిక వేధింపులు ఎదురైతే వెంటనే సదరు వ్యక్తిపై జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవచ్చు. అంటే ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. ఐపీసీ 354(ఎ), 354(డి), BNS సెక్షన్ 79 కింద కేసు నమోదు చేయవచ్చు. సెక్షన్ 354 కింద మహిళపై దాడికి పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. సెక్షన్ 294 ప్రకారం మూడు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఎదురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలి.

News November 10, 2025

విజయవాడ బస్‌స్టాండ్‌లో బొమ్మ పడబోతోంది.. వచ్చే నెల నుంచే!

image

విజయవాడ బస్టాండ్‌లోని రెండు మినీ థియేటర్లు సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ తెరచుకోనున్నాయి. ఇటీవల రూ.2.5 లక్షలకు టెండర్లు దక్కించుకోవడంతో ప్రస్తుతం రిపేర్ పనులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు లేదా డిసెంబర్ తొలి వారంలో సినిమా ప్రదర్శనలు ప్రారంభిస్తారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రెండు థియేటర్లలో కలిపి 200 సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయి.

News November 10, 2025

మెట్‌పల్లి: పెళ్లి చేయట్లేదని తండ్రిని చంపేశాడు..!

image

మెట్‌పల్లిలో <<18248546>>కన్నకొడుకు చేతిలో తండ్రి హతమైన<<>> విషయం తెలిసిందే. అయితే హత్యకుగల కారణం పెళ్లి అని SI కిరణ్ తెలిపారు. అన్వేష్ తనకు పెళ్లి చేయాలని తండ్రితో తరచూ గొడవపడేవాడు. ఎంతకీ సంబంధాలు కుదరకపోవడంతో కక్ష పెంచుకున్న కొడుకు తండ్రిపై దాడి చేశాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ అతడిని కుటుంబీకులు NZBలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఉదయం మరణించాడు. మృతుడి మరో సంతానం ఫిర్యాదుతో కేసు నమోదైంది.