News February 6, 2025
వేములవాడ: రాజన్న సేవలో జబర్దస్త్ నటులు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని గురువారం జబర్దస్త్ నటులు సుడిగాలి సుదీర్, ఆటో రామ్ ప్రసాద్‌లు దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, అందరూ బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు.
Similar News
News February 6, 2025
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 6,000 పరుగులు, 600 వికెట్లు తీసిన ఏకైక భారత స్పిన్నర్‌గా (కపిల్ దేవ్ తర్వాత రెండో క్రికెటర్) నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆయన ఈ ఘనత సాధించారు. మరోవైపు ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ ఫీట్ సాధించారు. ఇప్పటివరకు ఆయన 41 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో జేమ్స్ అండర్సన్(40)ను ఆయన అధిగమించారు.
News February 6, 2025
మంత్రి సంధ్యారాణికి 19వ ర్యాంక్
సీఎం చంద్రబాబు మంత్రులకు గురువారం ర్యాంకులు ప్రకటించారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో పార్వతీపురం మన్యం జిల్లా మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి 19వ ర్యాంక్ వచ్చింది. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం మంత్రికి సూచించారు.
News February 6, 2025
రాహుల్, ఖర్గేలతో భారీ సభలు: TPCC చీఫ్
TG: ఈ నెలాఖరులోగా రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సూర్యాపేటలో కులగణనపై రాహుల్ గాంధీతో, ఎస్సీ వర్గీకరణపై మెదక్‌లో ఖర్గేతో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించాం. సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని, కులగణనపై దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నేతలకు సూచించాం’ అని పేర్కొన్నారు.