News February 25, 2025

వేములవాడ: రెండు బైక్‌లు ఢీ.. గాయాలు

image

వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ ముందు రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన సాయి, లక్షణ్‌, చందుర్తి మండలం సనుగులకు చెందిన భూపతి, గంగాధర్‌కు గాయాలయ్యాయి. దీంతో వారిని స్థానికులు వేములవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 25, 2025

మార్చి 1న HYD, రంగారెడ్డిలో రేషన్ కార్డుల పంపిణీ

image

కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మొదటిగా ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్, HYD ప్రజలకు మార్చి1న అందించనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. రంగారెడ్డిలో 24వేల కొత్త రేషన్ కార్డులు, వికారాబాద్‌లో 22 వేలు, మేడ్చల్‌లో 6వేలు, HYD 285 రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, దీనికి చివరి గడువంటూ ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు.

News February 25, 2025

పార్వతీపురం: ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

image

స్థానిక మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మంగళవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవీఎంలు నిక్షిప్తంగా భద్రపరచిన గోడౌన్‌ను పీరియాడిక్ తనిఖీల్లో భాగంగా అక్కడ భద్రత, గోడౌన్‌కు వేసిన సీల్‌లను నిశితంగా పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశించారు.

News February 25, 2025

ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

image

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన ఆత్మకూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రహీంఖాన్‌పేట్‌కు చెందిన గూడూరు చంద్రశేకర్, మత్సగిరి సోమవారం రాత్రి బంధువుల ఇంటి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో, వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!