News February 3, 2026
వేములవాడ: 2 వార్డులలో కాంగ్రెస్ రెబెల్స్ నామినేషన్ల ఉపసంహరణ

వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని రెండు వార్డులలో కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 4వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేసిన కొలకాని రాజు, 16వ వార్డు నుంచి నామినేషన్లు దాఖలు చేసిన బొందిల మహేష్, కూరగాయల కొమరయ్య మంగళవారం తమ నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. దీంతో 4వ వార్డు నుంచి తోటరాజు, 16 వార్డు నుంచి కూరగాయల శ్రీశైలం కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు.
Similar News
News February 18, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.14,140
* 10 గ్రాములు వెండి ధర రూ.2,460.
News February 18, 2026
జుట్టు పొడిబారకుండా ఉండాలంటే?

పొడిబారి ఉన్న కురులకు గాఢత తక్కువగా, తేమను పెంచే షాంపూలను ఎంచుకోవాలి. పొడి జుట్టు ఉన్నవారు సల్ఫేట్ ఫ్రీ ఫార్ములాతో ఉన్న మాయిశ్చరైజింగ్ షాంపూలను ఎంచుకోవాలి. తేమను నిలిపే హైలురోనిక్ యాసిడ్, స్క్వాలేన్ వంటివి ఉండేలా చూసుకోవాలి. తలస్నానం చేశాక కండిషనర్ తప్పనిసరిగా రాసుకోవాలి. అయినా సమస్య తగ్గకపోతే డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించి పోషకాల లేమి ఏమైనా ఉంటే… సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది.
News February 18, 2026
బెండలో కాండం తొలిచే పురుగు నివారణ ఎలా?

బెండను మొవ్వు, కాయ తొలుచు పురుగు ఆశించడం వల్ల మొక్కలు చనిపోవడంతో పాటు కాయలు పనికిరాకుండా పోతాయి. ఈ పురుగుల నివారణకు కొమ్మలకు రంధ్రం చేసిన ప్రాంతం నుంచి అంగుళం కిందకు తుంచి నాశనం చేయాలి. లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml లేదా క్వినాల్‌ఫాస్ 2ml చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి. పంట కాపునకు రాని దశలో లీటరు నీటికి థయోడికార్బ్ 1గ్రా. కలిపి పిచికారీ చేయాలి.


