News May 6, 2024
వేములవాడ: DSP హెచ్చరిక
ప్రధాని మోదీ వేములవాడ పర్యటన నేపథ్యంలో నేటి నుంచి బుధవారం వరకు 3 రోజుల పాటు వేములవాడ పట్టణ పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించినట్లు డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డ్రోన్లు వినియోగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News January 17, 2025
ధర్మపురి ఆలయ ఆదాయ వివరాలు
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.1,31,585 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.80,158, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.36,200, అన్నదానం రూ.15,227,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
News January 17, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ రుద్రంగి మండలంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మల్లాపూర్ మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య. @ కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో తప్పిపోయిన మహిళ. @ గొల్లపల్లి మండలంలో బోల్తా పడిన కారు. @ జగిత్యాల లో పోలీసులకు క్రీడా పోటీల నిర్వహణ. @ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్న కరీంనగర్ కలెక్టర్.
News January 16, 2025
సరస్వతీ పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో కమిటీ!
కాలేశ్వరంలో మే 15 నుంచి 26 వరకు నిర్వహించే సరస్వతీ నది పుష్కరాలపై ఆరుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీకి చైర్మన్గా కలెక్టర్, సభ్యులుగా ఎస్పీ, దేవాదాయ శాఖ ఆర్జెసి, యాదగిరిగుట్ట వేద పాఠశాల ప్రిన్సిపల్, ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఏఈలు ఉండనున్నారు. పుష్కరాలకు రూ.25 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయగా, పనులను ప్రారంభించారు.