News December 18, 2025

వేమూరు: ‘చిన్న తరహా పరిశ్రమలను ప్రభుత్వ ప్రోత్సహిస్తోంది’

image

చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా పరిశ్రమల శాఖ
జనరల్ మేనేజర్ రామకృష్ణ అన్నారు. శుక్రవారం వేమూరు ఎంపీడీవో కార్యాలయంలో పారిశ్రామికవేత్తల ఉద్యమ ఆధార్ రిజిస్ట్రేషన్ క్యాంపు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..మహిళా సంఘాల సభ్యులు యువ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. కుటీర పరిశ్రమల ఏర్పాటుకు పీఎంఈజీ, పీఎంఎఫ్ఈ రుణాలు పొందాలంటే ఉద్యమ ఆధార్ నమోదు కావాలన్నారు.

Similar News

News December 22, 2025

పాకాల: 50 మందికి కారుణ్య నియామక పత్రాల అందజేత

image

ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో కారుణ్య నియామకాల కింద 50 మందికి నియామక పత్రాలను సోమవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం క్లీన్ ఎనర్జీ దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఉద్యోగుల సమష్టి కృషితోనే వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ రంగంలో 250 మందికి కారుణ్య నియామకాలు కల్పించామని ఆయన స్పష్టం చేశారు.

News December 22, 2025

GWL: కలెక్టర్ ప్రజావాణిలో 42 ఫిర్యాదులు

image

ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితుల నుండి మొత్తం 42 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ప్రతి అర్జీ వెనుక బాధితుల ఆవేదన ఉంటుందని, ఏ ఒక్కటీ పెండింగ్‌లో పెట్టకుండా త్వరితగతిన న్యాయం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

News December 22, 2025

శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 37 అర్జీలు

image

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఏఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం
శ్రీకాకుళంలోని జిల్లా SP కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యలు విన్నారు. మొత్తం 37 అర్జీలు స్వీకరించామన్నారు.