News November 30, 2025

వేమూరు: 5 ఆర్ఓబీలు నిర్మాణ ప్రతిపాదనలపై అధికారుల పరిశీలన

image

వేమూరు నియోజకవర్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లు ఏర్పాటుకు శ్రీకారంచుడుతున్న నేపథ్యంలో అధికారులు సంయుక్తంగా శనివారం నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. మొత్తం ఐదు ఆర్ఓబీలులు మంజూరుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా శనివారం అధికారులు చుండూరు మండలం మోదుకూరులో పర్యటించి బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాలను తనిఖీ చేశారు. రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని వారు తెలిపారు.

Similar News

News December 1, 2025

లైంగిక వేధింపులు.. హీరోయిన్ కజిన్ ఆత్మహత్య

image

లైంగిక వేధింపులను భరించలేక హీరోయిన్ ఆశికా రంగనాథ్ కజిన్ అచల(22) ఆత్మహత్య చేసుకున్నారు. ‘దూరపు బంధువు మయాంక్‌తో అచలకు స్నేహం ఏర్పడింది. డ్రగ్స్‌కు బానిసైన మయాంక్ ఆమెను ప్రేమిస్తున్నానని ఫిజికల్ రిలేషన్‌ కోసం ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో దాడి చేసి, మానసికంగా వేధించాడు’ అని బంధువులు ఆరోపిస్తున్నారు. అచల Nov 22న బెంగళూరులో ఉరేసుకుందని, ఇప్పటికీ మయాంక్‌పై చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు.

News December 1, 2025

వీటిపై తిరుపతి, చిత్తూరు MPలు మాట్లాడేనా..?

image

కడప-రేణిగుంట హైవే నిర్మాణానికి ఫారెస్ట్ శాఖ అనుమతులు ఇచ్చినా వర్కింగ్ పర్మిషన్ ఇంకా రాలేదు. ఇటీవల కళత్తూరు హరిజనవాడలో చెరువు తెగి అందరూ నష్టపోగా సరైన సాయం అందలేదు. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి అంతర్జాతీయ సర్వీసులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుపై అడుగులు పడలేదు. నేటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వీటిపై తిరుపతి, చిత్తూరు MPలు గురుమూర్తి, ప్రసాదరావు గళమెత్తుతారా? లేదా?

News December 1, 2025

రబీ వరి.. సాగు విధానం, ఎకరాకు విత్తన మోతాదు

image

☛ నాట్లు వేసే పద్ధతిలో- 20 కేజీల విత్తనం
☛ పొడి విత్తనం వెదజల్లే పద్ధతిలో 25-30 కేజీల విత్తనం
☛ మండి కట్టిన విత్తనం వెదజల్లే పద్ధతిలో 12-15 కిలో విత్తనం
☛ గొర్రు విత్తే పద్ధతిలో 15-20 కిలోల విత్తనం
☛ యంత్రాలతో నాటే విధానంలో 12-15 కిలోల విత్తనం
☛ బెంగాల్ నాటు విధానంలో అయితే 10-12 కిలోల విత్తనం
☛ శ్రీ పద్ధతిలో వరి నాటితే 2 కిలోల విత్తనం ఎకరాకు సరిపోతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.