News February 10, 2025

వేయి స్తంభాల ఆలయానికి 862 ఏళ్లు

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని చారిత్రక వేయి స్తంభాల ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. కాకతీయ శిల్పకళా శైలిలో రుద్ర దేవుడు ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఆలయాన్ని నిర్మించి సుమారుగా 862 ఏళ్లు అవుతుంది. ఆలయాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తూ శిల్పకళా సంపదను తిలకిస్తుంటారు. మీరు వేయి స్తంభాల ఆలయానికి వెళితే కామెంట్ చేయండి.

Similar News

News February 11, 2025

వరంగల్ నుంచి విద్యార్థులతో ట్రైన్లో చెన్నై వెళ్లనున్న రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వరంగల్‌కు అకస్మికంగా రానున్న విషయం తెలిసిందే. HNKలోని సుప్రభా హోటల్‌లో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. విద్యార్థులతో కలిసి ఢిల్లీ నుంచి వస్తున్న ఆయన.. రాత్రి 7:30కు WGL నుంచి చెన్నైకు రైలులో వెళ్లనున్నారు. సాయంత్రం హెలికాప్టర్ ద్వారా హన్మకొండకు చేరుకొని ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్య నేతలతో సమావేశం అవుతారని పార్టీ నేతలు తెలిపారు.

News February 11, 2025

నేడు హనుమకొండకు రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హనుమకొండకు రానున్నారు. ఢిల్లీ నుంచి ఈరోజు సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు చేరుకొని ఆ తర్వాత HNKలో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. దీంతో పార్టీ శ్రేణులు భారీగా హనుమకొండకు చేరుకుంటున్నాయి. రాహుల్ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

News February 11, 2025

WGL: ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ.. UPDATE

image

హనుమకొండలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు <<15418647>>పంచాయతీరాజ్ ఏఈ<<>> రమేశ్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాలు.. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన మొగిలయ్య ఇంటి నిర్మాణం కోసం పంచాయతీ రాజ్ ఏఈ రమేశ్ రూ.15వేలు లంచం అడిగి రూ.10వేలకు కుదుర్చుకున్నాడు. బాధితుడు అధికారులను సంప్రదించగా.. రమేశ్‌ను, ఏఈ సహాయకుడు సారయ్యను HNKలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.

error: Content is protected !!