News February 10, 2025
వేయి స్తంభాల ఆలయానికి 862 ఏళ్లు

హనుమకొండ జిల్లా కేంద్రంలోని చారిత్రక వేయి స్తంభాల ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. కాకతీయ శిల్పకళా శైలిలో రుద్ర దేవుడు ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఆలయాన్ని నిర్మించి సుమారుగా 862 ఏళ్లు అవుతుంది. ఆలయాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తూ శిల్పకళా సంపదను తిలకిస్తుంటారు. మీరు వేయి స్తంభాల ఆలయానికి వెళితే కామెంట్ చేయండి.
Similar News
News November 10, 2025
అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు: సీఎం చంద్రబాబు

ప్రముఖ కవి, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డా.అందెశ్రీ మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటన్నారు. అందెశ్రీ మరణం పట్ల మంత్రి లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అనే పాటతో పాటు ఎన్నో ఉద్యమ గీతాలు రాసిన ప్రజాకవికి శ్రద్ధాంజలి అని ట్వీట్ చేశారు. పలువురు ఏపీ మంత్రులు అందెశ్రీకి నివాళి అర్పించారు.
News November 10, 2025
విశాఖ: ఉద్యోగం లేదని ఆత్మహత్య

విశాఖలోని ఓ వ్యక్తి ఉద్యోగం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. సంపత్ కుమార్ (32) శంకరమఠం రోడ్డు రామలింగేశ్వర టెంపుల్ ఎదురుగా ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఉద్యోగం లేదనే మనస్తాపంతో సంపత్ సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరి ఫిర్యాదుతో ద్వారకానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంపత్‌కు పెళ్లి కాగా.. తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు.
News November 10, 2025
జూబ్లీహిల్స్‌లో మీ ఓటు ఆదర్శం అవ్వాలి!

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటరు మహాశయులారా.. రేపు మన వంతు అని గుర్తు పెట్టుకోండి. నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు నిన్నటితో ముగిశాయి. రేపు మన అమూల్యమైన ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. 4,01,365 మంది ఓటర్లలో మనం ఒక భాగం అని మర్చిపోకండి. MLAను ఎన్నుకునే బాధ్యత మనపైనే ఉంది. జూబ్లీహిల్స్‌కు 3 సార్లు ఎన్నిక జరిగినా సగం మంది ఓటెయ్యలేదు. ఈ బైపోల్‌లో మీరు వేసే ఓటు ఇతరులకు ఆదర్శం కావాలి. అందరూ ఓటెయ్యాలి.!


