News September 21, 2025

వేయి స్తంభాల గుడిలో వేడుకలు.. హాజరుకానున్న మంత్రులు

image

రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌నున్న బ‌తుక‌మ్మ వేడుక‌లు రేపు వేయిస్తంభాల గుడిలో ప్రారంభం కానున్నాయి. ప్రారంభ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క హాజరు కానున్నారు. రాష్ట్ర మ‌హిళ‌ల‌కు మంత్రి కొండా సురేఖ బ‌తుక‌మ్మ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్రభుత్వం ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింద‌ని మంత్రి సురేఖ తెలిపారు.

Similar News

News September 21, 2025

‘రంగు రంగు పూలు తెచ్చి రాశులు పోసి’

image

మహిళా శక్తికి, చైతన్యానికి ప్రతీకగా నిలిచే పండుగ ‘బతుకమ్మ’. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పూల పండుగను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రకృతి ఇచ్చిన పూలను దేవతగా భావించి ఆరాధిస్తారు. తొలి రోజును చిన్న బతుకమ్మ లేదా ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. ముందు రోజే సేకరించిన పూలతో బతుకమ్మను తయారు చేయడం, కొన్ని ప్రాంతాల్లో ఆహారం తిన్న తర్వాత తయారు చేయడంతో ఇలా పిలుస్తారని పూర్వీకులు చెబుతారు.

News September 21, 2025

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అమూల్య ఎంపిక

image

అనంతపురం జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్ల పరుగులో అద్భుత ప్రదర్శన చూపిన గుంతకల్లుకు చెందిన బి.అమూల్య రాష్ట్రస్థాయి అండర్-20 అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఆమె.. ఈనెల 27న ఏలూరులో జరిగే పోటీల్లో అనంతపురం జిల్లా తరఫున పాల్గొననుంది. విజయంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన అమూల్యను పలువురు అభినందించారు.

News September 21, 2025

ఈ గౌరవం నా ఒక్కడిదే కాదు: మోహన్ లాల్

image

దాదాసాహెబ్ ఫాల్కే <<17774717>>అవార్డుకు<<>> ఎంపికవ్వడం నిజంగా గర్వకారణమని నటుడు మోహన్ లాల్ ట్వీట్ చేశారు. ఈ గౌరవం తన ఒక్కడిదే కాదని, తన ప్రయాణంలో పక్కనే ఉండి నడిచినవారిదని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, ప్రేక్షకులు, సహచరులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల ప్రేమ, నమ్మకం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. డైరెక్టర్ అదూర్ గోపాలకృష్ణన్(2004) తర్వాత మలయాళం నుంచి ఈ అవార్డు అందుకోనున్న రెండో వ్యక్తి మోహన్ లాల్.