News January 26, 2026
వేరుశనగకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం

తెలుగు రాష్ట్రాల్లో వేరుశనగ రికార్డు స్థాయి ధర పలుకుతోంది. TGలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో ఆదివారం వేరుశనగకు రూ.12,009 రికార్డు స్థాయి ధర లభించింది. వనపర్తిలో క్వింటాకు రూ.12,002.. అచ్చంపేటలో క్వింటాకు రూ.11,877 ధర లభించింది. వేరుశనగకు ప్రస్తుతం క్వింటాకు రూ.6 వేలు- రూ.10వేలకు పైగా ధర పలుకుతోంది. తమ పంటకు పెరుగుతున్న డిమాండ్ చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 2, 2026
తెలుగు సినిమాకి తెలుగులో టైటిల్ ఏది?

తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ హీరో సూర్య నటిస్తున్న సినిమాకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్ ఖరారైంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్లపై విమర్శలొస్తున్నాయి. మూవీ టీమ్ తమిళం, ఇంగ్లిష్‌లోనే పోస్టర్లు రిలీజ్ చేసింది. తెలుగులో టైటిల్ పోస్టర్ ఇవ్వలేదు. దీంతో తెలుగు టైటిల్ ఎందుకు లేదు? తెలుగంటే నిర్లక్ష్యం ఎందుకు? అంటూ తెలుగు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
News March 2, 2026
22,195 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

<
News March 2, 2026
ఇరాన్‌లో ఎంత మంది చనిపోయారంటే..

మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం మారణహోమమే సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న దాడుల కారణంగా ఇరాన్‌లో ఇప్పటి వరకు 555 మంది మరణించినట్లు ఆ దేశంలోని రెడ్ క్రెసెంట్ సంస్థ ప్రకటించింది. మొత్తం 131 నివాసాలను టార్గెట్ చేసినట్లు వెల్లడించింది. గాయపడిన వారి వివరాలను మాత్రం చెప్పలేదు. శనివారం ప్రకటించిన సమాచారం ప్రకారం.. 201 మంది చనిపోగా, 747 మంది గాయపడ్డారు.


