News April 10, 2026

వేరుశనగ ధరలు పతనం

image

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. వారం రోజులుగా క్వింటా రూ.7 వేలకు పైగా పలికిన ధర, గురువారం గరిష్ఠంగా రూ.6,690లకు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌కు 113 క్వింటాళ్ల దిగుబడి రాగా, కనిష్ఠ ధర రూ.5,700, మధ్యస్తంగా రూ.6,121లకు అమ్ముడుపోయినట్లు యార్డ్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. ధరల తగ్గుదలపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 13, 2026

9 పరుగులకే సగం మంది ఔట్

image

RRతో మ్యాచులో SRH బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. 3 ఓవర్లలో 9 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. ప్రఫుల్ హింగే 4, సాకిబ్ హుస్సేన్ ఒక వికెట్ తీశారు. వైభవ్, జురెల్, ప్రెటోరియస్ డకౌట్ అయ్యారు. జైస్వాల్ (1), పరాగ్ (4) కూడా ఫెయిల్ అయ్యారు. ప్రస్తుతం రాజస్థాన్ స్కోర్ 3.3 ఓవర్లలో 11/5గా ఉంది. విజయానికి మరో 206 రన్స్ కావాలి.

News April 13, 2026

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్

image

కొండపాక మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, అందుకు రోడ్డు భద్రతా నియమాలను విధిగా పాటించాలని పిలుపునిచ్చారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించాలని ఆమె ప్రజలకు సూచించారు.

News April 13, 2026

ఎవరీ ప్రఫుల్ హింగే?

image

IPL: SRH కొత్త బౌలర్ ప్రఫుల్ హింగే తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి సంచలనం సృష్టించారు. ఇతడిని 2026 వేలంలో SRH రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. 2002లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన ఇతడు 10 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 27 వికెట్లు తీశారు. విదర్భ జట్టులో ఇతడు కీలక సభ్యుడు. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడంలో ఈ కుర్రాడు దిట్ట. ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచులోనే ప్రఫుల్‌కు డ్రీమ్ స్టార్ట్ దక్కింది.