News March 20, 2025

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి..

image

కర్లపాలెం మండలం యాజలికి చెందిన ప్రవీణ్ కుమార్(15) ఈతకు వెళ్లి బుధవారం మృతి చెందాడు. ఎస్ఐ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. యాజలిలోని పంట పొలాల్లో 20 అడుగుల లోతు ఉన్న ఓ గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు తెలిపారు. మరో ఘటనలో పిట్టలవానిపాలెం మండలం గోకరాజునల్లి బోయినవారిపాలెంలో విద్యుత్ షాక్ తగిలి కలుసు బేబీ(6) అనే బాలిక మృతి చెందింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Similar News

News March 20, 2025

ఐపీఎస్ అభిషేక్ మహంతికి స్వల్ప ఊరట

image

TG: ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి రాష్ట్ర హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. ఆయన్ను ఏపీకి అటాచ్ చేస్తూ కేంద్ర సిబ్బంది శాఖ చేసిన ఉత్తర్వులను ఈ నెల 24 వరకు నిలిపివేసింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అంతకుముందు సిబ్బంది శాఖ నిర్ణయంపై ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో సవాలు చేయగా అక్కడ చుక్కెదురైంది. అనంతరం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

News March 20, 2025

వనపర్తి: వృద్ధాప్య తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి: వి.రజని

image

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. గురువారం వనపర్తిలోని సీనియర్ సిటిజన్ ఫోరంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలు ఉన్నాయని, వారి సంరక్షణకు హెల్ప్ లైన్ నంబర్ 14567ను ఏర్పాటు చేశామన్నారు.

News March 20, 2025

వ్యాపారవేత్త ఆలోచనతో మహిళలు ముందుకు సాగాలి: కలెక్టర్

image

ఖమ్మం: సమాజంలో సమానత్వం రావాలంటే మహిళలు అన్ని రంగాలలో నైపుణ్య వ్యాపారం చేస్తూ ఆర్థిక బలం సాధిస్తే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం పెనుబల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఉన్న మండల మహిళా సమాఖ్య భవనంలో ఉషోదయ, ఆదర్శ మహిళా సమాఖ్యలతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వ్యాపారవేత్త ఆలోచనా ధోరణితో మహిళలు ముందుకు సాగాలని పేర్కొన్నారు.

error: Content is protected !!