News January 5, 2026

వేల ఏళ్ల విశ్వాసం.. సోమనాథ్ పునరుజ్జీవనంపై మోదీ ట్వీట్!

image

సోమనాథ్ ఆలయంపై పాషండుల తొలి దాడి జరిగి 1000 ఏళ్లు, పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. 1026లో గజనీ మహమ్మద్ దాడి చేసినా ఎవరూ విశ్వాసం కోల్పోలేదని, అందుకే నేటికీ ఆలయం కళకళలాడుతోందని ఆయన పేర్కొన్నారు. 1951లో జరిగిన పునర్నిర్మాణం భారత ఆత్మగౌరవానికి ప్రతీక అని, సోమనాథుని దర్శనం సర్వపాప హరణమని ఆయన గుర్తుచేశారు.

Similar News

News February 10, 2026

విశాఖ: జీవీఎంసీ కౌన్సిల్ చివరి సమావేశం 28న

image

జీవీఎంసీ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 28న నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు నిర్ణయించారు. అజెండా సిద్ధం చేసి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం వచ్చేనెల 17తో ముగియనుండటంతో, ఈ సమావేశమే చివరిదిగా నిలవనుంది. ప్రతి సభ్యుడు మాట్లాడేలా వరుసగా రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతో అజెండాలో భారీగా అంశాలు చేర్చే అవకాశముందని అధికారులు తెలిపారు.

News February 10, 2026

US-బంగ్లా ట్రేడ్ డీల్.. 1 శాతం సుంకం తగ్గింపు!

image

అమెరికా, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. టారిఫ్స్‌ను 20% నుంచి 19%కి అమెరికా కుదించింది. అంటే కేవలం 1% తగ్గించింది. నిజానికి బంగ్లా గూడ్స్‌పై 37% సుంకాలు విధించాలని మొదట్లో ప్రతిపాదించినా.. తర్వాత 20%కి తగ్గిస్తూ ట్రంప్ ప్రకటన చేశారు. తాజా డీల్‌తో US మెటీరియల్స్‌తో తయారు చేసిన పలు టెక్స్‌టైల్, అప్పెరల్ గూడ్స్‌కు జీరో టారిఫ్ యాక్సెస్ దొరుకుతుందని బంగ్లా అడ్వైజర్ యూనస్ ట్వీట్ చేశారు.

News February 10, 2026

నేషనల్ ఆయుష్ మిషన్‌లో ఉద్యోగాలు

image

<>నేషనల్<<>> ఆయుష్ మిషన్ 20 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల వారు FEB 27 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG డిప్లొమా (పబ్లిక్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్/మేనేజ్‌మెంట్), MBA, BAMS/BUMS/BHMS/BSMS/BYMS, M.Com/ICWA/CA/MCA/BCA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు జీతం రూ.35,000-రూ.1,00000 చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ayush.gov.in