News March 17, 2026
వేసవిలో చల్లదనాన్నిచ్చే తాటి ముంజలు

వేసవిలో చల్లదనాన్నిచ్చే తాటి ముంజలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతంలో రైతులు తమ పొలాలలో విరివిగా లబించే తాటి ముంజులను ఆరగిస్తున్నారు. ప్రజలంతా ఎంతో ఇష్టపడి తినే వాటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. రుచికరంగా ఉండే తాటి ముంజులను అందరూ ఇష్టంగా తింటారు. తెల్లగా మెరుస్తూ ఎంతో మృదువుగా ఉంటాయి. అందుకే వీటిని ఐస్ యాపిల్స్‌గా కూడా పిలుస్తారు.
Similar News
News April 13, 2026
కామారెడ్డి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే?

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. 7 ప్రాంతాలు ఎల్లో జోన్ లో ఉండగా మిగతా ప్రాంతాలన్నీ 40°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి. అత్యధికంగా ఎల్పుగొండ, బిచ్కుంద, బొమ్మన్ దేవిపల్లిలో 41.6°C, మాచాపూర్, మేనూర్ 41.5, కొల్లూరు 41.4, పిట్లం 41.3, లింగంపేట, మాక్డూంపూర్, నాగిరెడ్డిపేట 41.2, IDOC(కామారెడ్డి), దోమకొండ 41.1°C నమోదయ్యాయి.
News April 13, 2026
తిరుపతి: వేధించిన అధికారి సరెండర్..!

తిరుపతి జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయ ఉద్యోగినిని ఏపీసీ వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఉన్న పోస్టు అర్హతను ప్రభుత్వం మార్చింది. దీంతో ఆ ఉద్యోగి డిప్యుటేషన్‌పై ఈ శాఖలోకి వచ్చాడు. అక్కడే పనిచేసస్తున్న ఓ ఉద్యోగిని ఆయనపై వేధింపుల ఆరోపణలు చేయగా.. విచారణలో నిజమని తేలింది. దీంతో ఏపీసీని కలెక్టర్‌కు సరెండర్ చేశారు.
News April 13, 2026
భూపాలపల్లి: ఆశగా ఎదురుచూస్తున్న 18వేల మంది యువత..!

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులకు తప్ప అమలుకు నోచుకోలేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు 18వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా ఏడాది గడిచినా అమలుకు శ్రీకారం చుట్టలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారికి పథకం అమలు చేయాలని యువత కోరుతున్నారు.


