News March 26, 2024
వేసవిలో జాగ్రత్తలు పాటిదాం: కలెక్టర్

ముందస్తు చర్యలు చేపట్టి తాగునీటి కొరత, వడదెబ్బ వంటి వేసవి సమస్యలను అధిగమించాలని కడప జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అధికారులను ఆదేశించారు. తాగునీటి కొరత, వేసవి వడగాల్పులు, వడదెబ్బ, ముందస్తు జాగ్రత్త చర్యలు” పై తన ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందస్తుగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో దీనిపై ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News September 4, 2025
9న కడపలో గండికోట ముంపు వాసుల సమీక్ష.!

గండికోట ముంపు వాసుల సమీక్ష సమావేశం ఈనెల 9న కడప కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. సమావేశంలో కొండాపురం మండలంలోని ఓవన్నపేట, చౌటపల్లి, బొమ్మపల్లి మరో 11 గ్రామాల గృహాల పునరావాస పరిహారంపై చర్చించనున్నారు. జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి, అధికారులు పాల్గొంటారు. వీరితోపాటు కొంతమంది ముంపు బాధితులు వెళ్లనున్నారు.
News September 3, 2025
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా కడప జిల్లా నుంచి ముగ్గురు

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికను ప్రకటించింది. కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు అర్హులుగా నిలిచారు. పెండ్లిమర్రి మండలం ఎగువపల్లె హైస్కూల్‌కు చెందిన హిందీ టీచర్ ఖాదీర్, కాశినాయన మండలం రెడ్డికొటాల MPUPS, SGT బి.పరిమళ జ్యోతి, ప్రొద్దుటూరు పరిధిలోని లింగారెడ్డిపల్లె MPPS, SGT షేక్ జవహర్ మునీర్‌లు అవార్డుకు ఎంపికయ్యారు.
News September 3, 2025
కడప: చిన్నారిని అంగన్వాడీ స్కూల్లో ఉంచి తాళం వేసిన టీచర్

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం PCపల్లి అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థినిని పాఠశాలలో ఉంచి తాళం వేసిన ఘటన బుధవారం జరిగింది. హరికృష్ణ అనే విద్యార్థి ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వచ్చాడు. పొలం పనులకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు విద్యార్థి ఇంటికి రాకపోవడంతో వెతికారు. చివరికి అంగన్వాడీ కేంద్రం తాళం పగలగొట్టి చూడగా బాబు లోపల సృహతప్పి పడిపోయి ఉన్నాడు. ఈ ఘటనపై టీచర్ చంద్రకళను ప్రశ్నించగా సమాదానం లేదన్నారు.