News April 8, 2026
వేసవిలో జాగ్రత్త: పిల్లలను ఈతకు పంపొద్దు

వేసవి తీవ్రత దృష్ట్యా చెరువులు, బావుల్లో <<19595547>>ఈతకు<<>> వెళ్తున్న విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారు. లోతు అంచనా వేయలేక నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జిల్లాలో విషాదం నింపుతున్నాయి. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాంతకమైన చోట్ల ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇటువంటి విషాదాల నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చు.
Similar News
News April 10, 2026
HYD: DGP ఎదుట లొంగిపోనున్న 30మంది మావోయిస్టులు

హైదరాబాద్‌లో ఈరోజు భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుపోతుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మ.3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. మొత్తం 30 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోనుండగా, ఇందులో PLGA బెటాలియన్ సభ్యులు ఉన్నట్లు సమాచారం. లొంగుబాటుతో నక్సలిజం నిర్మూలనలో పోలీసులు మరో ముందడుగు వేశారు.
News April 10, 2026
HYD: రాజకీయ నేత కుమారుడి లైంగిక వేధింపులు.. బాలిక ఆత్మహత్య

హయత్‌నగర్‌లో దారుణం జరిగింది. ఓ రాజకీయనేత కుమారుడి లైంగిక వేధింపులకు మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. విషయాన్ని బయటకు చెబితే కుటుంబాన్ని అంతం చేస్తామని బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. కూతురు మృతదేహాన్ని తీసుకొని సొంత గ్రామానికి బాధితులు వెళ్లిపోయారు. బాలిక మృతికి కారకులపై పోక్సో కేసు నమోదు చేయాలంటూ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలి తండ్రి PSలో ఫిర్యాదు చేయడానికి వస్తున్నట్లు సమాచారం.
News April 10, 2026
HYD నుంచి అయోధ్య, కాశీకి రైళ్లు

తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం IRCTC ఏప్రిల్ 14 నుంచి జూన్ 12 వరకు HYD నుంచి అయోధ్య, కాశీ, వైష్ణో దేవి, దక్షిణ భారతదేశ క్షేత్రాలను సందర్శించేలా 4 ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఈ టూర్లలో ప్రయాణం, హోటల్ వసతి, 3 పూటలా భోజనం, గైడ్, భద్రతా సౌకర్యాలు కల్పిస్తుండగా, టికెట్ ధరలు రూ.14,500 నుంచి రూ.34,100 వరకు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల వారు IRCTC వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.


