News March 6, 2025
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడండి: కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉండే హ్యాండ్ పంపులను అవసరమైతే మరమ్మతులు చేయించాలన్నారు. ఎక్కడైనా పైప్ లైన్ లీకేజీలు, డామేజీలు ఉంటే వెంటనే సరి చేయాలన్నారు.
Similar News
News March 6, 2025
జడ్చర్ల: క్రేన్ మరమ్మతుల కోసం వచ్చి హత్య

క్రేన్ మరమ్మతుల కోసం వచ్చి <<15574517>>వ్యక్తిని <<>>హత్య చేసిన ఘటన MBNR జిల్లా జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామంలో జరిగింది. హైదరాబాద్ ఎంజీబీఎస్లో పోలీసులు బుధవారం నిందితుణ్ని అరెస్ట్ చేశారు. కేసు పూర్వాపరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. 24వ తేదీన క్రేన్ మరమ్మతు కోసం పుణేకు చెందిన వినయ్ రాగా అతను బస చేస్తున్న గది వద్ద బిహార్‌కు చెందిన రషీద్‌తో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అతన్ని గోడకేసి బాది చంపేశాడు.
News March 6, 2025
విద్యార్థినికి నియామక పత్రం అందజేసిన సీఎం

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదివిన విద్యార్థిని పూజిత మొన్న వనపర్తిలోని ఉద్యోగం మేళాకు ఎంపికైంది. త్రెడ్ ఐటీ కంపెనీలో ఉద్యోగం సాధించిన పూజితకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ కే.ఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. తమ కళాశాల విద్యార్థి మంచి ఉద్యోగం సాధించడం తమకు గర్వకారణం అన్నారు
News March 6, 2025
బెల్లయ్యకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వండి.. LHPS వినతి

LHPS వ్యవస్థాపక అధ్యక్షులు బెల్లయ్య నాయక్‌కు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని LHPS రాష్ట్ర కమిటీ నాయకులు బుధవారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా LHPS రాష్ట్ర నాయకులు విస్లావత్ చందర్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి గిరిజనుల సమస్యలపై బెల్లయ్య ఎన్నో పోరాటాలు చేశారన్నారు.