News February 23, 2026

వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు పూర్తి సన్నాహాలు: ఎస్‌ఈ గంగాధర్

image

NPDCL పరిధిలో విద్యుత్ డిమాండ్ 5,904 మెగావాట్లకు చేరిందని PDPL సర్కిల్ ఎస్‌ఈ గంగాధర్ తెలిపారు. వేసవిలో పీక్ లోడ్‌ను ఎదుర్కొనేందుకు 126 కొత్త డీటీల ఏర్పాటు, 12 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, 11 సబ్‌స్టేషన్లు నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. 26 బ్రేకర్లు, 15 ఇంటర్‌లింకింగ్ లైన్లు ఏర్పాటు చేసి సరఫరా నాణ్యత మెరుగుపరిచామని, అంతరాయం లేకుండా విద్యుత్ అందించేందుకు సన్నాహాలు పూర్తిచేసినట్లు స్పష్టం చేశారు.

Similar News

News February 25, 2026

బోరాన్ లోపాన్ని ఎలా నివారించాలి?

image

మొక్కల్లో బోరాన్ లోప లక్షణాలు కనిపిస్తే ముందుగా ఆ నేలకు భూసార పరీక్షలు నిర్వహించాలి. బోరాన్ లోపం నిజమైతే ఎకరాకు దుక్కిలో 4kgల బోరాక్స్‌ను వేసి కలియదున్నాలి. సేంద్రీయ ఎరువులను క్రమం తప్పకుండా వాడాలి. పంట కాలంలో లోపం గమనిస్తే లీటరు నీటికి బోరాక్స్‌ 1 గ్రా. కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. వాణిజ్య పంటల్లో 1% బోరాక్స్ ద్రావణాన్ని మొలకెత్తిన 30, 45, 60, 90 రోజుల్లో పిచికారీ చేయాలి.

News February 25, 2026

కాకినాడ: రూ.8కోట్ల డ్వాక్రా నిధుల గోల్‌మాల్‌.. రికవరీపై నిర్లక్ష్యం!

image

కరప, తూరంగి, యూ.కొత్తపల్లి, పిఠాపురం మండలాల్లోని డ్వాక్రా సంఘాల్లో సుమారు రూ.8 కోట్లకు పైగా నిధులు మాయమవ్వడం కలకలం రేపుతోంది. తాము చెల్లించినా మళ్లీ అప్పులు కట్టాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో డీఆర్‌డీఏ పీడీ నిర్లక్ష్యం వహిస్తున్నారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని బాధితులు తెలిపారు.

News February 25, 2026

వైద్యుల తొలగింపుతో కొత్త నియమకాలకు అవకాశం!

image

వైద్య కళాశాలలలో ఫ్యాకల్టీ ఉండి విధులకు హాజరు కాక వైద్య విద్యార్థులకు సరైన విద్యా అందడం లేదు. దీనికి కారణాలపై విశ్లేషించిన ప్రభుత్వం విధులకు హాజరు గాని వైద్యులను ఉద్యోగాల నుండి తొలగించి కొత్తగా నియమకాలు చేపట్టాలన్న నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 94 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను తొలగించగా, అందులో ఉమ్మడి జిల్లా నుంచి 17 మంది ఉన్నారు. వీరి స్థానంలో త్వరలోనే కొత్త నియమకాలు ప్రభుత్వం చేపట్టనున్నారు.