News December 22, 2025

వేసవిలో మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు: సీఎండీ

image

వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. సబ్‌స్టేషన్లలో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ పనులు పూర్తి చేయాలని, హెచ్‌టీ సర్వీసులకు AMR అమలు చేయాలని సూచించారు. హై లాస్ ఫీడర్లపై ప్రత్యేక దృష్టి సారించి నష్టాలు తగ్గించాలన్నారు. ఈ మేరకు కార్పొరేట్ కార్యాలయం నుంచి 17 సర్కిళ్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Similar News

News December 26, 2025

ఆదిలాబాద్: అయోమయంలో స్వతంత్ర సర్పంచ్‌లు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో GP ఎన్నికలు హోరాహోరీగా ముగిశాయి. ఈ నెల 22న సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు ప్రమాణస్వీకారం చేశారు. పార్టీల మద్దతుతో గెలిచిన వారు ఆయా పార్టీల ముఖ్య నేతలతో తమ సంబరాలు పంచుకుంటున్నారు. ఏ పార్టీ మద్దతు లేకుండా గెలిచిన స్వతంత్ర సర్పంచ్‌లు అయోమయంలో పడ్డారు. ఏ పార్టీలో చేరాలనేదీ తేల్చుకోలేకపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, BRS పార్టీల్లో ఎటు వెళ్లితే అభివృధి చేసుకోవచ్చని ఆలోచిస్తున్నారు.

News December 26, 2025

DRDOలో 764పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

DRDOకు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్‌లో 764 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు JAN 1వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-28 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. పోస్టును బట్టి డిప్లొమా, BSc, BLSc, MLSc, టెన్త్, ITI ఉత్తీర్ణులు అర్హులు. టైర్ 1, టైర్ 2 రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీ వెళ్లండి.

News December 26, 2025

WGL: ఆర్టీఏ సేవల్లో సెప’రేటు’?

image

వరంగల్, హనుమకొండ ఆర్టీఏ కార్యాలయాల్లో వసూళ్ల దందా జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్రోకర్ల సిగ్నల్‌తోనే డ్రైవింగ్ టెస్ట్ పాస్ చేస్తున్నారని, సరైన ట్రాక్ లేకున్నా వందల లైసెన్సులు జారీ అవుతున్నాయని విమర్శలు ఉన్నాయి. లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలో ఆపరేటర్లే సమాధానాలు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రతి సేవకు రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారని, అక్రమ సంపాదనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.