News March 1, 2026

వేసవి ఆరంభంలోనే పీక్ స్టేజ్‌కి విద్యుత్ డిమాండ్

image

TG: వేసవి ఆరంభంలోనే ఎండలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే రాష్ట్రంలో విద్యుత్ డిమాండూ పెరిగిపోతోంది. శనివారం 6057 MW గరిష్ఠ డిమాండ్‌ నమోదు కాగా నేడు దాన్ని దాటి 6267 MWకు చేరుకుంది. రానున్న కాలంలో ఎండలు మరింత పెరిగి డిమాండూ అధికమయ్యే పరిస్థితి ఉందని NPDCL CMD వరుణ్ రెడ్డి తెలిపారు. అయితే ఇబ్బందులు తలెత్తకుండా డిమాండ్‌కు తగ్గ విద్యుత్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

Similar News

News March 2, 2026

NTPCలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>NTPC<<>> 8 Sr. మేనేజర్, ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి మార్చి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. BE/BTech(కెమికల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్/స్క్రీనింగ్, రాత పరీక్ష/CBT, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. Sr. మేనేజర్‌కు నెలకు రూ.90K-రూ.2.40L, ఇంజినీర్‌కు రూ.50K-రూ.1.60L చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in

News March 2, 2026

ఇరాన్ వార్.. ఇండియా వైఖరి మారిందా?

image

ఇజ్రాయెల్‌తో మోదీ క్లోజ్ రిలేషన్, ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతిపై ఇండియా సైలెన్స్.. ఇవన్నీ చూస్తుంటే భారత్ ఈసారి ఒక సైడ్ తీసుకుందని కొంతమంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా పవర్‌ఫుల్ సైడ్ వైపు మొగ్గు చూపుతోందని విశ్లేషిస్తున్నారు. UAEకి సంఘీభావం తెలపడం, ఖమేనీ మరణంపై సంతాపం ప్రకటించకపోవడం ఈ మార్పుకు నిదర్శనాలనే వాదనను ముందుంచుతున్నారు.

News March 2, 2026

మేం సేఫ్: మంచు విష్ణు

image

ఇరాన్-ఇజ్రాయెల్ వార్ వల్ల దుబాయ్‌లో చిక్కుకుపోయిన టాలీవుడ్ యాక్టర్ <<19266979>>మంచు విష్ణు<<>> తన ఫ్యామిలీ సేఫ్ అని కన్ఫర్మ్ చేశారు. ‘మేమంతా దుబాయ్‌లో సేఫ్‌గా ఉన్నాం. అప్పుడప్పుడు దూరంగా శబ్దాలు వినిపిస్తున్నా.. ఇక్కడ లైఫ్ నార్మల్ గానే ఉంది’ అని ట్వీట్ చేశారు. ఇంతటి టెన్షన్ టైమ్‌లోనూ UAE ప్రభుత్వం చూపిస్తున్న లీడర్‌షిప్, ఇక్కడి సెక్యూరిటీ అరేంజ్‌మెంట్స్ చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు.