News February 18, 2026

వేసవి కార్యాచరణ సిద్ధం చేయాలి: కామారెడ్డి కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News February 21, 2026

HYD: 5 ఓట్లు ఉంటే రూ.లక్ష..!

image

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ఓట్ల కోసం సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బరిలో నిలిచిన వారు ఒకరిని మించి ఒకరు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసినట్లు సమాచారం. కొన్నిచోట్ల ఐదు ఓట్లు ఉన్న ఇంటికి లక్షల్లో డబ్బులు అందినట్లు తెలుస్తోంది. బలమైన అభ్యర్థులు ఉన్న వార్డుల్లో రూ.10 నుంచి 15 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు చర్చ నడుస్తోంది.

News February 21, 2026

కర్రి పద్మశ్రీ ఎమ్మెల్సీ పదవిపై వీడని ఉత్కంఠ!

image

కాకినాడకు చెందిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ రాజీనామాపై శుక్రవారం శాసనమండలి ఛైర్మన్ వివరణ తీసుకున్నారు. 2024లో ఆమె YCP నుంచి TDP లో చేరిన సమయంలోనే రాజీనామా చేశారు. అయితే సాంకేతిక కారణాలతో ఆమోదం లభించలేదు. దీనిపై ఈనెల 24 మంగళవారం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఛైర్మన్ వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కాకినాడ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

News February 21, 2026

నల్గొండ: హత్యాయత్నం.. తండ్రీకూతుళ్లకు రిమాండ్

image

భూ తగాదా నేపథ్యంలో వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన తండ్రీకూతుళ్లకు NLG కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. NKP(M) అమ్మనబోలుకి చెందిన జెర్రిపోతుల రమేష్, బాసాని శివ మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ నెల 19న వివాదాస్పద స్థలంలో రమేష్ తన భార్య సమాధి నిర్మిస్తుండగా, శివ అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన రమేశ్, అతని కుమార్తె నేహ కలిసి శివపై కత్తితో దాడి చేశారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.