News February 28, 2026
వేసవి కాలంలో రక్తదానం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

వేసవి కాలంలో రక్తదానం చేసేవారు హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం. ఇందుకోసం రక్తదానానికి ముందు, తర్వాత పుష్కలంగా నీరు తాగాలి. పండ్ల రసాలు, గ్లూకోజ్ పానీయాలు తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. రక్తదాన కేంద్రానికి వెళ్లేటప్పుడు ఎండ తగలకుండా గొడుగు/టోపీ/స్కార్ఫ్ ధరించాలి. బ్లడ్ ఇచ్చిన తర్వాత 15-20min రెస్ట్ తీసుకోవాలి. భారీ శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. ఆకుకూరలు, పప్పులు, ఖర్జూర వంటివి ఆహారంగా తీసుకోవాలి.
Similar News
News March 1, 2026
ఒక్కరి చావుకు వందల మంది బలి!

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీని అంతం చేసినట్లు ట్రంప్ ప్రకటన, మీడియా రిపోర్ట్స్ నేపథ్యంలో US తన ప్రధాన లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్‌తో కలిసి చేస్తున్న ఈ దాడుల్లో కొన్ని వందల అమాయక ప్రాణాలు బలవుతున్నాయి. ఇప్పటివరకు 200 మందికిపైగా చనిపోగా 700 మందికిపైగా గాయపడ్డారు. ఇక మృతుల్లో 85 మంది బాలికలూ ఉన్నారు. మినాబ్ గర్ల్స్ ప్రైమరీ స్కూల్‌పై జరిగిన దాడిలో వీరు ప్రాణాలు కోల్పోయారు.
News March 1, 2026
రబీ జొన్న పంటలో ఎదుగుదల లోపించిందా?

చలి, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా రబీలో నాటిన జొన్న పంట ఎదుగుదల కొన్నిచోట్ల లోపించినట్లుగా కనిపిస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి లీటరు నీటికి 19-19-19 మిశ్రమాన్ని 5గ్రాముల చొప్పున కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అలాగే జొన్న పంటలో ఒకవేళ కత్తెర పురుగును గుర్తిస్తే లీటరు నీటికి క్లోరాంట్రానిప్రోల్ 0.4ml లేదా స్పైనటోరమ్ 0.5ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News March 1, 2026
కలలో చీపురు కనిపిస్తే..

కలలు సాధారణం. అయితే అందులో చాలా వస్తువులు కనిపిస్తాయి. వాటిపై అనేక అపోహలుంటాయి. అందులో చీపురు ఒకటి. అది కనిపిస్తే అశుభమని భయపడతారు చాలామంది. కానీ అది పొరపాటని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ‘చీపురు లక్ష్మీదేవి స్వరూపం. కలలో చీపురు కనిపిస్తే దరిద్రం తొలగిపోతుంది. అదృష్టం వరిస్తుంది. ఇది జీవితంలో రాబోయే సానుకూల మార్పులకు సూచిక. ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది’ అని వివరిస్తున్నారు.


